టెర్మినేటర్ : డార్క్ ఫేట్ – ట్రైలర్
టెర్మినేటర్ : డార్క్ ఫేట్.. ప్రపంచవ్యాప్తంగా నవంబరు 1న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది..

టెర్మినేటర్ : డార్క్ ఫేట్.. ప్రపంచవ్యాప్తంగా నవంబరు 1న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది..
హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. టెర్మినేటర్ సిరీస్‌లో వచ్చే సినిమాలకు వరల్డ్ వైడ్ చాలా క్రేజ్ ఉంది. రీసెంట్‌గా ఈ సిరీస్‌లో ఆరవ సినిమాగా ‘టెర్మినేటర్: డార్క్ ఫేట్ ’ వస్తుంది. ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ మరోసారి టెర్మినేటర్‌గా అలరించనుండగా, ‘డెడ్‌పూల్’ ఫేమ్ టిమ్ మిల్లర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రముఖ దర్శక నిర్మాత జేమ్స్ కెమరూన్ నిర్మిస్తున్నాడు.
‘టెర్మినేటర్ 2 : జడ్జిమెంట్ డే’కు కంటిన్యూషన్‌గా రూపొందుతున్న ‘టెర్మినేటర్: డార్క్ ఫేట్ ’ ట్రైలర్ రీసెంట్‌గా రిలీజ్ అయ్యింది. ‘నా పేరు సారా కానర్. ఆగస్టు 29, 1997.. అది జడ్జిమెంట్ డే. కానీ, నేను నా భవిష్యత్తును మార్చుకున్నాను. మూడు బిలియన్ (300 కోట్ల మంది) జీవితాల్ని కాపాడాను..’ అంటూ.. లిండా హామిల్టన్ గతాన్ని గుర్తు చేసుకోవడంతో స్టార్ట్ అయిన ట్రైలర్ ఇంట్రస్టింగ్‌గా ఉంది.
Read Also : మంచు ఐరా విద్యను చూశారా : ఎంత క్యూట్‌గా ఉందో!
జేమ్స్ కామెరూన్, ఛార్లెస్ ఎగ్లీ, జోష్ ఫ్రైడ్‌మ్యాన్ కథ అందించారు. నటాలియా రేయెస్, డియెగో బోనెటా తదితరులు నటించిన టెర్మినేటర్ : డార్క్ ఫేట్.. ప్రపంచవ్యాప్తంగా నవంబరు 1న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది.