Mana Shankara Vara Prasad Garu : తెలంగాణలో ‘మన శంకర వరప్రసాద్‌గారు’ టికెట్ ధరల పెంపు
తెలంగాణలో మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu) చిత్రానికి టికెట్ ధరలను పెంచుకునే తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
TG government Issues Ticket Price Hike To Mana Shankara Vara Prasad Garu Movie
- జనవరి 12న చిరంజీవి మన శంకర వరప్రసాద్‌గారు మూవీ రిలీజ్
- టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
- వారం రోజుల పాటు
Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక. విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో నటించిన ఈ చిత్రం (Mana Shankara Vara Prasad Garu)సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక రోజు ముందుగానే అంటే జనవరి 11న స్పెషల్ ప్రీమియర్లు వేయనున్నారు.
ఇక ఈ చిత్రానికి టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600 గా నిర్ణయించింది. వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌లో రూ.50(జీఎస్టీతో కలిపి), మల్టీప్లెక్స్‌లలో రూ.100 (జీఎస్టీతో కలిపి) టికెట్ ధర పెంచుకునే అవకాశం కల్పించింది.
Srinivasa Mangapuram : మహేష్ అన్న కొడుకు హీరోగా ఫస్ట్ లుక్ వచ్చేసింది
ఏపీలోనూ..
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఈ చిత్రానికి టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. స్పెషల్ షో టికెట్ ధరను 500 రూపాయలు ఖరారు చేయగా.. జనవరి 12 నుంచి 10 రోజులపాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ లలో 100 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో 125 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే రోజుకు 5 షోల వరకు అనుమతి ఇచ్చారు.
