పూరి ఫేవరెట్ ప్లేస్‌లో కరోనా
కరోనా ఎఫెక్ట్ : థాయ్‌లాండ్‌లోనూ లాక్‌డౌన్..

కరోనా ఎఫెక్ట్ : థాయ్‌లాండ్‌లోనూ లాక్‌డౌన్..
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఫేవరెట్ ప్లేస్‌లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ సిటీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకూ కరోనా విజృంభిస్తుండడంతో లాక్‌డౌన్ ప్రకటించారు. ఎయిర్ పోర్టుల నుంచి అన్ని రవాణా సౌకర్యాలూ, టూరింగ్ ప్లేసులు బంద్ అయ్యాయి.
మన తెలుగు ప్రేక్షకులకు బ్యాంకాక్, థాయ్‌లాండ్ వంటి ప్రాంతాల పేర్లు వినబడగానే ఠక్కున గుర్తొచ్చే పేరు పూరి జగన్నాధ్.. తన సినిమాలకు కథ, స్క్రీన్ పే, డైలాగ్స్‌తో సహా పూరి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూర్చుని రాస్తుంటాడు. అక్కడ అయితే ఎవరూ డిస్టర్బ్ చేయరని ప్రశాంతంగా రాసుకోవచ్చని చెప్తుంటాడు కానీ అక్కడి లైఫ్‌స్టైల్‌కి మనోడు బాగా అలవాటు పడిపోయాడనే మాట ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంటుంది. బ్యాంకాంక్ అంటే పూరికే కాదు చాలామంది జల్సా రాయుళ్లకీ ఇష్టమే.
ఇటీవల హైదరాబాద్‌లో భార్యలకి బెంగుళూరు వెళ్తున్నామని చెప్పి ఇద్దరు వ్యక్తులు థాయ్ మసాజ్ కోసం బ్యాంకాక్ వెళ్లొచ్చిన సంగతి వెలుగు చూసింది. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా కొద్దిరోజుల పాటు థాయ్‌లాండ్‌లోని పటాయా, బ్యాంకాక్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలన్నీ మూతపడనున్నాయి. అయితే పూరి కొంతకాలంగా తన సినిమా స్క్రిప్ట్ పనులన్నీ గోవా మరియు హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో కానిచ్చేస్తున్నాడు.
Read Also : హీరోయిన్లపై బ్రహ్మాజీ ఆగ్రహం