తెలుగు రాష్ట్రాలకూ సాయం.. దళపతి విజయ్ గొప్పదనం..

  • Published By: Mahesh ,Published On : April 27, 2020 / 12:44 PM IST
తెలుగు రాష్ట్రాలకూ సాయం.. దళపతి విజయ్ గొప్పదనం..

Updated On : April 27, 2020 / 12:44 PM IST

కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అండగా నిలిచేందుకు తమిళ స్టార్ హీరో విజయ్ ముందుకొచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 5 లక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా ప్రకటించాడు. కరోనాపై పోరాటంలో భాగంగా విజయ్ ఇప్పటివరకు వివిధ రాష్ట్రప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి కలిపి మొత్తం 1.3 కోట్లను విరాళంగా ఇచ్చారు. 

తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెరో రూ.5 లక్షలు, కేరళకు రూ.10 లక్షలు, స్వరాష్ట్రం తమిళనాడుకు రూ.50 లక్షలు, కేంద్ర ప్రభుత్వ సహాయనిధికి రూ.25 లక్షలు, దక్షిణ భారత నటుల సంఘానికి(FEFSI) రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చి తన మంచి మనసు చాటుకున్నారు దళపతి విజయ్. వీటితో పాటు విజయ్ ఫ్యాన్స్ క్లబ్ తరపున మరికొంత మొత్తాన్ని కరోనా బాధితులకు అందచేయడం జరిగింది.