Game Changer : దసరాకి రామ్‌చరణ్ ‘గేమ్‌ఛేంజర్’ టీజర్ లేనట్టే..? తమన్ ట్వీట్‌తో ఫ్యాన్స్‌లో నిరాశ..
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్.

Thaman gives Game Changer Teaser and Third single update
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. అంజలి, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.
ఈ చిత్రం డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఈ చిత్ర సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్ర అప్డేట్ లను ఇస్తూ వస్తున్నాడు. ఇప్పటికే రెండు పాటలు.. ‘జరగండి’, ‘రా మచ్చా మచ్చా’ పాటలను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ఇక మూడో పాటను అక్టోబర్‌లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే తమన్ చెప్పేశాడు.
దసరాకు ఈ మూవీ నుంచి టీజర్ వస్తుందని ఎంతో మంది ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే.. వారికి తమన్ షాకిచ్చాడు. అతడి ట్వీట్ చూస్తుంటే దసరాకు టీజర్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
‘‘దసరాకు టీజర్ రాలేదని నిరాశపడొద్దు ఫ్రెండ్స్. టీమ్ నిరంతరం ఆ పనుల్లోనే ఉంది. సీజీ, వీఎఫ్‌ఎక్స్ ఫైనల్ ఎడిటింగ్, డబ్బింగ్, బ్యాక్‌గ్రౌండ్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రతినెలా ఒక లిరికల్ పాటను విడుదల చేయడం కోసం అన్ని పాటలకు లిరిక్స్ వర్క్స్ పూర్తి చేశాం. మూడో సాంగ్ ఈ నెల (అక్టోబర్) 30న ప్రేక్షకుల వస్తుంది.’ అని తమన్ ట్వీట్ చేశాడు.
ఇక ఈ సినిమా డిసెంబర్ 20న లేదంటే క్రిస్‌మస్ రోజున ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపాడు.
Jabardasth : జబర్దస్త్ లోకి మరో కొత్త జడ్జి.. బుల్లితెరపై బ్యూటిఫుల్ సినిమా జంట..
Suppose Dussehra Ki Teaser Rallaedhu Anni disappoint Avvakandi .. guys !! 🫶
Team is on Full Work finalising
Cg VFX Shots final editing of the film & Dubbing
BGM score started already .. and we are getting Lyrical video works done for all the songs which is goona be released…— thaman S (@MusicThaman) October 8, 2024