Tumbbad : ఈ సినిమా ముందు ఏ స్టార్ హీరోలు పనిచేయలేదు.. రీ రిలీజ్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమా..

2018 అక్టోబర్ లో బాలీవుడ్ లో తుంబాడ్ అనే ఓ చిన్న సినిమా రిలీజయింది.

Tumbbad : ఈ సినిమా ముందు ఏ స్టార్ హీరోలు పనిచేయలేదు.. రీ రిలీజ్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమా..

Tumbbad Movie Creates New Record in Re Release Collections

Updated On : October 8, 2024 / 1:02 PM IST

Tumbbad : ఇటీవల పాత సినిమాలు చాలా రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలు అయితే రీ రిలీజ్ లో కూడా కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. ఏకంగా 10 కోట్ల పైనే రీ రిలీజ్ లో కలెక్షన్స్ సాధించిన స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. ఫ్యాన్స్ వాటినే గొప్ప రికార్డులుగా చెప్పుకొని ప్రచారం చేసుకున్నారు. కానీ ఆ రికార్డులన్నీ ఓ చిన్న సినిమా తుడిచిపెట్టేసింది.

2018 అక్టోబర్ లో బాలీవుడ్ లో తుంబాడ్ అనే ఓ చిన్న సినిమా రిలీజయింది. నిధి కోసం సాగే ఓ హారర్ కథ ఇది. అప్పట్లోనే ప్రేక్షకులని మెప్పించింది ఈ సినిమా. కానీ దేశవ్యాప్తంగా అంతగా రీచ్ రాలేదు. ఆ తర్వాత ఓటీటీలో కొంత పేరొచ్చింది. అయితే ఈ సినిమాని ఇటీవల సెప్టెంబర్ లో దేశమంతా రీ రిలీజ్ చేసారు. ఈ రీ రిలీజ్ కోసం చాలా మంది హారర్ అభిమానులు ఎదురుచూసారు. దీంతో రీ రిలీజ్ లో తుంబాడ్ సినిమాకు విపరీతమైన స్పందన వచ్చింది.

Also Read : Jabardasth : జబర్దస్త్ లోకి మరో కొత్త జడ్జి.. బుల్లితెరపై బ్యూటిఫుల్ సినిమా జంట..

తుంబాడ్ సినిమా రిలీజయినప్పుడు 16 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రీ రిలీజ్ లో ఏకంగా 32 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సెకండ్ రిలీజ్ లోమొదటి సారి కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టామే కాకుండా దేశంలో ఏ స్టార్ హీరో సినిమా కూడా రీ రిలీజ్ లో కలెక్ట్ చేయనంత కలెక్టు చేసి సరికొత్త రికార్డ్ సృష్టించింది. రీ రిలీజ్ లో దేశవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా తుంబాడ్ నిలిచింది.

ఈ సినిమా రహి అనిల్ బరువే దర్శకత్వంలో సోహుమ్ షా మెయిన్ లీడ్ లో తెరకెక్కింది. దీనికి గతంలో సీక్వెల్ కూడా ప్రకటించారు.