Game Changer : గేమ్ చేంజర్‌లో ఆరు కంటే ఎక్కువ సాంగ్స్.. అంతేకాదు హీరో థీమ్స్.. థమన్!
రామ్ చరణ్ పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ చెంజర్‌లో ఆరు కంటే ఎక్కువ సాంగ్స్ మరియు హీరో థీమ్స్ తో కలిపి..

Thaman preparing more than 6 songs for Ram Charan Game Changer
Game Changer : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా పొలిటికల్ నేపథ్యంతో తెరకెక్కుతున్న మూవీ ‘గేమ్ చెంజర్’. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి మరో తమిళ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథని అందిస్తుండడం విశేషం. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ 50 శాతం షూటింగ్ పూర్తీ చేసుకుంది. ఇటీవలే లాంగ్ బ్రేక్ తరువాత ఒక యాక్షన్ షెడ్యూల్ ని స్టార్ట్ చేసి శరవేగంగా పూర్తి చేశారు. కాగా ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.
RRR in Japan : జపాన్ ఆగని RRR సునామీ.. క్రిస్టొఫర్ నొలన్ 8 సినిమాల రికార్డు బ్రేక్..
ప్రస్తుతం బ్రో మూవీ ప్రమోషన్స్ ఉన్న ఈ సంగీత దర్శకుడు.. గేమ్ చెంజర్ పాటలు గురించి అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాలో ఆరు కంటే ఎక్కువ సాంగ్స్ ఉండబోతున్నాయని, అంతేకాకుండా హీరో థీమ్స్ తో కలుపుకొని 10కి పై మ్యూజిక్ ట్రాక్స్ ఈ మూవీలో ఉండబోతున్నాయని తెలియజేశాడు. ఈ మూవీతో తన పూర్తి టాలెంట్ ని ఆడియన్స్ చూడబోతున్నారంటూ థమన్ చాలా నమ్మకంగా చెబుతున్నాడు. దీంతో చరణ్ అభిమానుల్లో ఈ మూవీ మ్యూజిక్ పై అంచనాలు క్రియేట్ అయ్యాయి.
Baby OTT Release Date : బేబీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఇక ఈ మూవీలోని సాంగ్స్ ని కూడా టాప్ కొరియోగ్రాఫర్స్ అయిన ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్, జానీ మాస్టర్స్ డిజైన్ చేస్తుండడంతో మూవీలోని చరణ్ డాన్స్ పై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. కాగా ఈ సినిమాలో చరణ్ కి జోడిగా కియారా అద్వానీ (Kiara Advani) మరోసారి కనిపించబోతుంది. ఆగష్టు 15న ఈ మూవీ నుంచి టీజర్ లేదా గ్లింప్స్ ని రిలీజ్ చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు గాని, ప్రస్తుతం నెట్టింట ఈ వార్త ట్రెండ్ అవుతుంది.