Thammareddy : మహేష్‌కి పవన్ మాట ఇచ్చాడు.. కానీ అది.. తమ్మారెడ్డి సంచలన కామెంట్స్!

ఇటీవల తమ్మారెడ్డి భరద్వాజ నిత్యం మీడియాలో నిలుస్తూనే ఉంటున్నాడు. తాజాగా టాలీవుడ్ లోని నటులు, టెక్నీషియన్స్ గురించి మరో సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Thammareddy : మహేష్‌కి పవన్ మాట ఇచ్చాడు.. కానీ అది.. తమ్మారెడ్డి సంచలన కామెంట్స్!

Thammareddy Bharadwaja comments on mahesh babu pawan kalyan

Updated On : April 16, 2023 / 2:37 PM IST

Thammareddy : టాలీవుడ్ సీనియ‌ర్ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ (Bharadwaja Thammareddy) ఇటీవల నిత్యం మీడియాలో నిలుస్తూనే ఉంటున్నాడు. మొన్న RRR విషయంలో ఆస్కార్ కి అన్ని కోట్లు ఖర్చు చేశారని వ్యాఖ్యానించిన మాటలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపాయి. తాజాగా టాలీవుడ్ లోని నటులు, టెక్నీషియన్స్ గురించి మరో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండస్ట్రీలో ఒకరికి సమస్య వచ్చినప్పుడు మరొకరు వచ్చి అండ‌గా నిల‌బ‌డ‌రు అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి ఉదాహరణగా చెబుతూ మహేష్ బాబుకి (Mahesh Babu) జరిగిన ఒక సంఘటన చెప్పుకొచ్చాడు.

Pawan Kalyan : పవన్ మరో కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నాడా.. ఏ దర్శకుడితో?

“అర్జున్ మూవీ పైరసీకి గురైన సమయంలో మహేష్ ఫిలిం ఛాంబర్ లో కూర్చొని సమస్య కోసం పోరాడాడు. ఆ సమయంలో మహేష్ కి అండగా వచ్చి ఎవరు నిలబడలేదు. ఆ పోరాటంలో పవన్ కళ్యాణ్ అయితే మహేష్ కి మాట ఇచ్చాడని తెలిసింది. కానీ పవన్ తరువాత మహేష్ ని కలిశాడా? లేదా? నాకు తెలియదు. ఆ సమయంలో ఒక్క పవన్ తప్ప మహేష్ కి ఎవరు మద్దతు తెలపకపోవడంతో.. ఆ తరువాత మహేష్ బయటకి రావడమే మానేశాడు. తన పని తాను చూసుకుంటూ పోతున్నాడు.

Mahesh Babu : మహేష్ బాబు సినిమా రిలీజ్ కోసం సుకుమార్ భార్య వెయిటింగ్.. ఏ మూవీ తెలుసా?

అంత ఎందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఎవరన్నా అండగా నిలుస్తున్నారా? ఎవరైనా తన కోసం మాట్లాడుతున్నారా? ఇండస్ట్రీలో ఎవడు ఎవడి కోసం రారు. అలాగే నలుగురు కలిసి నన్ను చులకన చేస్తూ మాట్లాడారని, నేను తిరిగి అలాగే మాట్లాడేంత కుసంస్కారిని కాను. ఎవడో బుడ్డి లేని వాడు నన్ను అంటున్నాడని నవ్వు ఉరుకుంటాను” అంటూ వ్యాఖ్యానించాడు. కాగా ఇటీవల RRR విషయంలో మెగా బ్రదర్ నాగబాబు తన పై చేసిన వ్యాఖ్యలు దృష్టిలో పెట్టుకొనే తమ్మారెడ్డి మాట్లాడినట్లు తెలుస్తుంది.