Keedaa Cola : కీడా కోలా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు..? ఎక్కడ..?
తరుణ్ భాస్కర్ కీడా కోలా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఎప్పుడు..? ఎక్కడో తెలుసా..?

Tharun Bhascker Keedaa Cola ott release date details
Keedaa Cola : పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ సూపర్ హిట్స్ అందుకున్న టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ చాలా గ్యాప్ తీసుకోని తెరకెక్కించిన సినిమా ‘కీడా కోలా’. క్రైం కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ’30 వెడ్స్ 21′ సిరీస్ ఫేమ్ చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్ తో పాటు తరుణ్ భాస్కర్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారు. నవంబర్ 3న రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్ లో మంచి టాక్ నే సొంతం చేసుకుంది.
ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు డేట్ ని ఫిక్స్ చేసుకుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ఈ సినిమా స్ట్రీమ్ కాబోతుంది. డిసెంబర్ 29న ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్స్ కి ఒక రోజు ముందుగానే ఈ సినిమా అందుబాటులోకి రాబోతుంది. మరి థియేటర్ లో ఈ చిత్రాన్ని మిస్ అయ్యిన వారు ఉంటే, ఓటీటీలో చూసి నవ్వుకోండి.
Also read : Salaar : సలార్ స్పెషల్ షోలకు పర్మిషన్.. టికెట్ రేట్లు ఎంతో తెలుసా..?
View this post on Instagram
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఒక కూల్ డ్రింక్ చుట్టూ తిరుగుతుంది. కూల్ డ్రింక్ లో వచ్చిన బొద్దింకని చూపించి కంపెనీ పై కేసు వేసి కోట్లు కొల్లగొడదామని ఒక బ్యాచ్, కోట్ల కోసమే తానే బొద్దింకని కూల్ డ్రింక్ వేసిన ఒక నేరస్తుడు.. ఆ కీడా ఉన్న కోలా కోసం జరిగిన సంగ్రామమే సినిమా కథ. ఈ స్టోరీని తరుణ్ భాస్కర్ తనదైన స్టైల్ చూపిస్తూనే నటించి కూడా అలరించాడు. ఇక సినిమాలో బ్రహ్మానందంకి ఎక్కువ డైలాగ్స్ లేకపోయినా కేవలం హావభావాలతోనే ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించారు.