Sundeep Kishan : తన సినిమా హిట్ కాదని ఆ నటుడికి ముందే తెలుసట

హీరో సందీప్ కిషన్‌కి తను నటించిన ఆ సినిమా హిట్ కాదని ముందే తెలుసునట.. తాజాగా ఆ సినిమా గురించి సందీప్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏ సినిమా?

Sundeep Kishan : తన సినిమా హిట్ కాదని ఆ నటుడికి ముందే తెలుసట

Sundeep Kishan

Updated On : February 8, 2024 / 5:44 PM IST

Sundeep Kishan : రంజిత్ జయకోడి డైరెక్షన్‌లో గతేడాది ఫిబ్రవరి 3న ‘మైఖేల్’ సినిమా రిలీజైంది. సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, దివ్యాంశ కౌశిక్ వంటి స్టార్ నటించిన ఈ సినిమా అనుకున్న రీచ్‌ను అందుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమాపై సందీప్ కిషన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Disney Plus Share Password : నెట్‌‌ఫ్లి‌క్స్ బాటలో డిస్నీ ప్లస్.. ఇకపై పాస్‌‌వర్డ్ షేరింగ్ చేయలేరు.. అదనంగా చెల్లించాల్సిందే..!

సందీప్ కిషన్ నటించిన యాక్షన్ సినిమా ‘మైఖేల్’ సినిమా లాస్ట్ ఇయర్ భారీ అంచనాల మధ్య రిలీజైంది. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ సినిమా తనకు అసలు నచ్చలేదని తాజాగా సందీప్ కిషన్ వ్యాఖ్యలు చేసారు. తన లేటెస్ట్ మూవీ ‘ఊరి పేరు భైరవకోన’ సినిమా ప్రమోషన్లలో భాగంగా సందీప్ కిషన్ మైఖేల్ సినిమా గురించి మాట్లాడారు.

Fighter : ఫైటర్ మూవీలో లిప్ లాక్ సీన్‌పై హృతిక్, దీపికకు లీగల్ నోటీసులు

మైఖేల్ సినిమా గతేడాది ఫిబ్రవరి 3న రిలీజైంది. ఈ సినిమా చాలా డిజప్పాయింట్ చేసిందని.. తనకు అసలు నచ్చలేదని సందీప్ కిషన్ చెప్పారు. ఈ సినిమాను ఇద్దరు ప్రొడ్యూసర్లు నమ్మారని.. కానీ ఒక ప్రొడ్యూసర్ మాత్రం అనుమానపడుతూనే ఉన్నారని రిలీజ్ కి 12 రోజుల ముందు సినిమా రీ చెక్ చేయడానికి తాను భయపడ్డానని సందీప్ అన్నారు. సినిమా ముందు రోజు రాత్రి చూసిన తర్వాత చాలా అప్‌సెట్ అయ్యానని చెప్పుకొచ్చారు. టెక్నికల్‌గా ఎక్ట్రార్డినరీ సినిమా అయినా అనుకున్నట్లుగా కథ ల్యాండ్ అవ్వలేదన్నారాయన. ఈ సినిమా పోతే నెక్ట్స్ ఏంటనుకునే రకాన్ని కాదని మైఖేల్ సినిమా అపజయాన్ని పర్సనల్‌గా తీసుకున్నానని సందీప్ కిషన్ చెప్పారు. సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ ‘ఊరి పేరు భైరవకోన’ ఫిబ్రవరి 16న థియేటర్లలోకి వస్తోంది. నిజానికి ఫిబ్రవరి 9న రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే ఇదే డేట్‌కి రవితేజ ‘ఈగల్’ రిలీజ్ ఉండటంతో ‘ఊరి పేరు భైరవకోన’ ఫిబ్రవరి 16కి మారింది. ఈ సినిమా సందీప్‌కి మంచి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.