National Film Awards 2023 : మెగా హీరోలు న‌టించిన చిత్రాల పంట పండింది..!

సినీ ప్రియులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న 69వ జాతీయ అవార్డుల‌ను(69th National Film Awards) కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ అవార్డుల్లో తెలుగు సినిమాలు స‌త్తా చాటాయి.

National Film Awards 2023 : మెగా హీరోలు న‌టించిన చిత్రాల పంట పండింది..!

Vaishnav Tej-Ramcharan

Updated On : August 24, 2023 / 8:15 PM IST

National Film Awards : సినీ ప్రియులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న 69వ జాతీయ అవార్డుల‌ను (69th National Film Awards) కేంద్ర ప్ర‌భుత్వం గురువారం సాయంత్రం ప్ర‌క‌టించింది. ఈ అవార్డుల్లో తెలుగు సినిమాలు స‌త్తా చాటాయి. జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అల్లు అర్జున్ (Allu Arjun) అవార్డు గెలుచుకున్నాడు. 68 ఏళ్ల సినీ చ‌రిత్ర‌లో ఈ ఘ‌న‌త‌ అందుకున్న మొద‌టి తెలుగు న‌టుడిగా నిలిచాడు. ఇంకా చాలా కేట‌గిరిల్లో తెలుగు సినిమాలు అవార్డులు సొంతం చేసుకున్నాయి.

కాగా.. మెగా ప‌వ‌ర్ స్టార్‌ రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు 6 అవార్డులు రాగా, వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన ‘ఉప్పెన’ సినిమా ప్రాంతీయ ఉత్త‌మ చిత్రంగా, మ‌రో చిత్రం ‘కొండ‌పొలం’ బెస్ట్ లిరిక్స్ కేట‌గిరీల్లో అవార్డులొచ్చాయి. దీంతో మెగా ఇంట (Mega Family) జాతీయ అవార్డుల పంట అంటూ మెగా ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో కామెంట్ల‌తో హోరెత్తిస్తున్నారు. మెగా ఫ్యాన్స్  సంబరాలు చేసుకుంటున్నారు.

National Film Awards 2023 : RRR కి నేషనల్ అవార్డ్స్ పంట.. తెలుగు విజేతలు వీరే..

ఆర్ఆర్ఆర్ చిత్రానికి వ‌చ్చిన అవార్డులు ఇవే..

– బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ (వి శ్రీనివాస్ మోహన్)
– ఉత్త‌మ కొరియోగ్ర‌ఫీ (ప్రేమ్ ర‌క్షిత్‌)
– ఉత్త‌మ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీర‌వాణి
– ఉత్త‌మ ప్లే బ్యాక్ సింగ‌ర్ కాల‌భైర‌వ (కొమురంభీముడో..)
– ఉత్తమ యాక్షన్‌ డైరెక్షన్‌ అవార్డ్ (స్టంట్‌ కొరియోగ్రఫీ) కింగ్ సోలమన్
– అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం

Allu Arjun : 69 ఏళ్ళ తెలుగువారి నిరీక్షణ.. అల్లు అర్జున్ నిజం చేసి చూపించాడు..