Kapil Sharma show : ఫేస్‌బుక్ లైవ్‌లో ఆత్మహత్యాయత్నం చేసిన కమెడియన్.. ఇంటికి వెళ్లి చూసే సరికి..
కపిల్ శర్మ(Kapil Sharma)తో పాటు అతడితో పని చేసిన తీర్థానందరావు(Tirthanand Rao)కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. అయితే.. తాజాగా తీర్థానందరావు సోషల్ మీడియా లైవ్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించారు.

Tirthanand Rao
Kapil Sharma show : ఇటీవల కాలంలో కొందరు చిన్న చిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు మందలించారనో, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయనో కారణం ఏదైనప్పటికీ ఆత్మహత్య ఒక్కటే శరణ్యం అని భావిస్తున్నారు. ఓ కమెడియన్ సోషల్ మీడియా లైవ్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపుతోంది.
కపిల్ శర్మ షో(Kapil Sharma show) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో నవ్వించింది ఈ షో. కపిల్ శర్మ(Kapil Sharma)తో పాటు అతడితో పని చేసిన తీర్థానందరావు(Tirthanand Rao)కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. అయితే.. తాజాగా తీర్థానందరావు ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడుతూ విషం తాగాడు. ఇది చూసిన అతని మిత్రులు వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ ను సంప్రదించారు.
Shah Rukh Khan: పబ్లిక్‌గా మహిళా అభిమాని చేసిన పనికి షాకైన షారుఖ్ ఖాన్.. ఏం చేసిందో తెలుసా..?
పోలీసులు తీర్థానందరావు ఇంటికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతకముందు ఆయన లైవ్ వీడియోలో మాట్లాడుతూ తాను ఓ మహిళతో సహజీవనం చేస్తున్నానని, ఆమె డబ్బు కోసం వేధిస్తోందని ఆరోపించాడు. ఆమె వల్ల తాను అప్పుల్లో కూరుకుపోయినట్లు చెప్పాడు.
‘గతేడాది అక్టోబర్ నుంచి ఆమె నాకు తెలుసు. ఆమె వల్ల నేను లక్షల్లో అప్పుల పాలు అయ్యాను. భయాందర్‌లో నాపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఏ కారణం చేత ఆమె అలా చేసిందో నాకు తెలియదు. తనను పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తోంది. డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది. మానసికంగా వేధిస్తోంది. నా ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి, మానసిక ఆందోళనకు ఆమె కారణం.’ అంటూ ఆ వీడియోలో తీర్థానందరావు అన్నాడు.
ఇదిలా ఉంటే.. గతంలోనూ తీర్థానందరావు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ తరువాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పాడు. కుటుంబ సమస్యలు కూడా ఉన్నట్లు చెప్పాడు. తాను ఆస్పత్రిలో ఉంటే తనను చూడడానికి ఎవరూ రాలేదన్నాడు. ఇంటికి వచ్చాక కూడా ఒంటరిగానే ఉన్నట్లు చెప్పాడు. తీర్థానందరావు 2016వరకు కపిల్ శర్మతో కలిసి పనిచేశారు. ఆ తరువాత సినిమాల్లో అవకాశాలు రావడంతో షో ని వీడి వెళ్లాడు.