The Kerala Story: తమిళనాడులో ‘ది కేరళ స్టోరి’ బ్యాన్.. కాంట్రోవర్సీయే కారణమట!
‘ది కేరళ స్టోరి’ మూవీ సమాజానికి ప్రమాదకరమైన సందేశాన్ని ఇచ్చే విధంగా ఉందని ఇంటెలిజెన్స్ తెలియజేయడంతో, ఈ మూవీని బ్యాన్ చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమవుతోందట.

The Kerala Story Movie To Get Ban In Tamil Nadu
The Kerala Story: ఇటీవల కాంట్రోవర్సీ చిత్రాల సంఖ్య ఎక్కువ అయ్యింది. దేశవ్యాప్తంగా కాంట్రోవర్సీకి కేరాఫ్‌గా నిలిచిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ మూవీలోని కంటెంట్ పలు వర్గాల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. అయితే, ఇప్పుడు ఇదే కోవలో మరో కాంట్రోవర్సీ మూవీ రాబోతుంది. ‘ది కేరళ స్టోరి’ అనే టైటిల్‌తో తెరకెక్కిన మూవీ రిలీజ్‌కు రెడీ అయ్యింది.
The Kerala Story : ది కేరళ స్టోరీ ట్రైలర్.. వివాదంపై ఫైర్ అయిన అదా శర్మ, డైరెక్టర్
కేరళలోని మహిళలు ఇస్లాం మతంలోకి మారి, వారు తీవ్రవాద సంస్థ అయిన ISISలో జాయిన్ అవుతున్నారనే కథాంశంతో ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన సుదీప్తో సేన్‌పై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వాస్తవిక అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంటున్నా, ఈ సినిమా సమాజానికి హానికారమైన సందేశాన్ని ఇచ్చే విధంగా ఉందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్‌పై పలు వివాదాలు క్రియేట్ అయ్యాయి.
Adah Sharma: మత వివాదంలో చిక్కుకున్న హీరోయిన్ ఆదా శర్మ..
కాగా, ఈ సినిమాను మే 5న దేశవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతుండగా, తమిళనాడు ప్రభుత్వం మాత్రం ఈ సినిమాను రిలీజ్ చేసేది లేదని తేల్చి చెబుతోంది. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఈ సినిమా సమాజంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపించే విధంగా ఉందని తమిళనాడు ప్రభుత్వం ఈ సినిమాను బ్యాన్ చేసేందుకు ఆలోచిస్తుందట. ఈ సినిమా రిలీజ్‌ను నిలిపివేయాలంటూ ఓ జర్నలిస్టు సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశాడట. ఇక ఈ సినిమాలో అదా శర్మ, యోగిత బిహాని, సోనియా బాలని, సిద్ధి ఇదాని ముఖ్య పాత్రల్లో నటించారు. మరి ‘ది కేరళ స్టోరి’ మూవీ తమిళనాట రిలీజ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.