Kidney Health: ఉదయం చేసే ఈ చిన్న పనులు కిడ్నీలను క్లీన్ చేస్తాయి.. మీరు కూడా చేయండి

కిడ్నీలు మన శరీరంలో అత్యంత ప్రధానమైన అవయవాలు. అవి రక్తం నుండి వ్యర్థాలను(Kidney Health) వాడకట్టడానికి సహాయపడతాయి. అలాగే,

Kidney Health: ఉదయం చేసే ఈ చిన్న పనులు కిడ్నీలను క్లీన్ చేస్తాయి.. మీరు కూడా చేయండి

Kidney Health: These small things you do in the morning will clean your kidneys

Updated On : August 31, 2025 / 12:28 PM IST

Kidney Health: కిడ్నీలు మన శరీరంలో అత్యంత ప్రధానమైన అవయవాలు. అవి రక్తం నుండి వ్యర్థాలను వాడకట్టడానికి సహాయపడతాయి. అలాగే, శరీరంలోని రసాయనిక సమతుల్యతను ఉంచడానికి బాధ్యత వహిస్తాయి. కిడ్నీ ఆరోగ్యం తగ్గడం, వాటి పనితీరు క్షీణించడం అనేది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ, మనం రోజూ చేసే కొన్ని సాధారణ, చిన్న పనులు కిడ్నీ ఆరోగ్యాన్ని(Kidney Health) మెరుగుపరచడంలో సహాయపడతాయి. మరి ఆ పనులు ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Health Tips: కాలి కడుపుతో టీ, కాఫీ తాగుతున్నారా? నయం చేయలేని రోగాలు రావొచ్చు.. జాగ్రత్త సుమీ

1. నీరు తాగడం:
ఉదయం పరగడుపున నీటిని తాగడం అనేది కిడ్నీల ఆరోగ్యానికి అతి ముఖ్యమైన చర్య. రాత్రి నిద్ర కారణంగా శరీరంలో నీటి స్థాయి తగ్గిపోతుంది. ఉదయం మొదటి పని గా త్రాగిన తాగిన నీరు కిడ్నీలను శుభ్రపరిచే ప్రక్రియను ప్రారంభిస్తుంది. శరీరంలోని విషవాయువులు, టాక్సిన్లు కిడ్నీల ద్వారా బయటకు పోతాయి. నీటి స్థాయిలను నిలుపుకోవడం శరీరంలోని హైడ్రేషన్‌ను పెంచుతుంది, అది కిడ్నీలను హెల్తీగా ఉంచుతుంది.

2.ఉప్పు రహిత ఆహారం తీసుకోవడం:
ఉదయం మంచి పోషకాహారాన్ని తీసుకోవడం, ముఖ్యంగా ఉప్పు తగ్గించి, తక్కువ ఆమ్లత కలిగిన ఆహారాలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఉప్పు అధికంగా తీసుకోవడం ద్వారా వల్ల కిడ్నీ మీద ఒత్తిడి పెరుగుతుంది.సోడియాన్ని బయటికి పంపడానికి ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. దీని వల్ల కిడ్నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అలా కాకుండా, తక్కువ ఉప్పు, సున్నితమైన ఆహారం తీసుకోవడం కిడ్నీ ఒత్తిడిని తగ్గిస్తుంది.

3.నిమ్మరసం తాగడం:
ఉదయం నిమ్మరసం నీటిలో కలిపి తాగడం కూడా కిడ్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మరసంలో ఉండే విటమిన్ C, సిట్రిక్ ఆమ్లం, ఇతర ఎంజైములు, టాక్సిన్లను బయటకు పంపే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. అలాగే శరీరం హైడ్రేషన్ పెంచుతుంది, విసర్జనను మెరుగుపరుస్తుంది.

4.పొద్దున్నే యోగా /శారీరక వ్యాయామం:
చిన్నపాటి యోగా /నడక వంటి శారీరక వ్యాయామాలు ఉదయం చేయడం వల్ల కిడ్నీ ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఈ వ్యాయామాలు రక్తసంచారాన్ని ప్రోత్సహిస్తాయి, టాక్సిన్లను వేగంగా బయటకు పంపడానికి సహాయపడతాయి.

5.ఆరోగ్యకరమైన పంటలు /పప్పుల వంటలు:
ఉదయం ఆహారంలో పప్పులు, మెథి, గోధుమలు వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల కూడా కిడ్నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ ఆహారాలు ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉందయం వల్ల ఇవి శరీరానికి సరైన పోషణను అందుతుంది. కిడ్నీలను శుభ్రంగా ఉంచడానికి, టాక్సిన్లను బయటకు పంపడానికి సహాయపడతాయి.