Vadivelu : తండ్రి స్టార్ కమెడియన్.. కొడుకు పల్లెటూర్లో వ్యవసాయం..

కోలీవుడ్‌లో ఆయనో స్టార్ కమెడియన్.. ఆయన కొడుకు మాత్రం పదేళ్లుగా తండ్రి ఇచ్చిన పొలంలో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆ తండ్రి-కొడుకులెవరంటే?

Vadivelu : తండ్రి స్టార్ కమెడియన్.. కొడుకు పల్లెటూర్లో వ్యవసాయం..

Vadivelu

Updated On : January 23, 2024 / 4:38 PM IST

Vadivelu : కోలీవుడ్ లెజెండరీ కమెడియన్ వడివేలు కొంచెం విరామం తరువాత వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన కొడుకు పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు ఆయన కుమారుడు ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

Vadivelu Son

Vadivelu Son

Pooja Kannan : సాయి పల్లవి చెల్లెలు పూజ కన్నన్ నిశ్చితార్థం ఫొటోలు..

కోలీవుడ్ స్టార్ కమెడియన్ వడివేలు కొన్ని వివాదాల తర్వాత తిరిగి వరుసగా సినిమాలు చేస్తున్నారు. 23వ పులికేశి సినిమా హిట్ అయ్యాక 24వ పులకేశి షూటింగ్ ప్రారంభించిన టైమ్‌లో వడివేలు, డైరెక్టర్ శంకర్ మధ్య  విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే వడివేలుపై తమిళ నిర్మాతల సంఘం నిషేధం విధించింది. అలా చాలా ఏళ్లుగా వడివేలు సినిమాలకు దూరం అయ్యారు. ఈ సమస్య ఇటీవలే పరిష్కారం కావడంతో తిరిగి సినిమాల్లో బిజీ అయ్యారు వడివేలు. ఈ మధ్యే  ‘మామన్నన్’ లో తన నటనతో అందరి ప్రశంసలు అందుకున్నారు. కాగా వడివేలు ఎప్పుడూ, ఎక్కడా తన ఇంటర్వ్యూల్లో  వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావించరు. ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలు కూడా బయటకు తెలియవు. కాగా వడివేలు కొడుకు సుబ్రమణి పెళ్లి ఫోటోలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూసిన జనం షాకయ్యారు. అసలు సుబ్రమణి ఎక్కడ ఉంటున్నారు? వడివేలు కొడుకుని సినిమాల్లోకి ఎందుకు తీసుకురాలేదు? అనుకున్నారు. కాగా సుబ్రమణి ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తండ్రి వడివేలు గురించి.. తమ కుటుంబం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

Sunny Leone : కొత్త బిజినెస్‌లోకి సన్నీ లియోన్.. భర్తతో కలిసి రెస్టారెంట్ ప్రారంభించిన నటి

వడివేలుకి కూతురు, కొడుకు ఉన్నారు. ఇద్దరికీ వివాహాలయ్యాయి. కొడుకు సుబ్రమణికి 10 ఏళ్ల క్రితం దగ్గర బంధువు కుమార్తెకు ఇచ్చి వివాహం చేసారట వడివేలు. అతికొద్దిమంది సమక్షంలో సుబ్రమణి పెళ్లైందట. తాజాగా యూట్యూబ్ ఛానల్‌కి స్నేహితులతో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుబ్రమణి మాట్లాడారు. తన తండ్రికి ఏ విషయంలో అయినా సిఫారసు చేయడం ఇష్టం ఉండదని అందుకే ఎక్కడా తండ్రి పేరు ఉపయోగించనని సుబ్రమణి చెప్పారు. తన తండ్రి అంటే తనకెంతో ఇష్టమని ఆయన పేరునే తన పిల్లలకు పెట్టానని అన్నారు. తనకు ఏ అవసరం వచ్చినా తండ్రి సాయం చేస్తారని కానీ తను ఆయన మీద ఆధారపడకుండా వ్యవసాయం చేసుకుంటున్నానని సిటీకి రమ్మని చెప్పినా వెళ్లనని సుబ్రమణి చెప్పారు. తండ్రి వడివేలు వారసత్వంగా ఇచ్చిన పొలంలో సుబ్రమణి వ్యవసాయం చేసుకుంటున్నారట.  సుబ్రమణి ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. నెటిజన్లు మీ కొడుకుని మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా తీర్చిదిద్దారని వడివేలుకి కితాబు ఇస్తున్నారు.