Sunny Leone : కొత్త బిజినెస్‌లోకి సన్నీ లియోన్.. భర్తతో కలిసి రెస్టారెంట్ ప్రారంభించిన నటి

బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ కొత్త బిజినెస్‌లోకి అడుగు పెట్టారు. ఈ మధ్య కాలంలో చాలామంది సెలబ్రిటీలు వెళ్లే దారిలోనే తాను కూడా వెళ్లి ఈ కొత్త వ్యాపారాన్ని ఎంచుకోవడం విశేషం.

Sunny Leone : కొత్త బిజినెస్‌లోకి సన్నీ లియోన్.. భర్తతో కలిసి రెస్టారెంట్ ప్రారంభించిన నటి

Sunny Leone

Updated On : January 23, 2024 / 4:19 PM IST

Sunny Leone : బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు కొత్త బిజినెస్ స్టార్ట్ చేసారు. భర్తతో కలిసి కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించారు సన్నీ. సోషల్ మీడియాలో స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

Tollywood : టాలీవుడ్‌లో 100 కోట్ల షేర్ అందుకున్న హీరోల వీరే.. ఆ ఏడుగురిలో తేజ సజ్జ..

అడల్ట్ సినిమాలకు గుడ్ బై చెప్పి బాలీవుడ్‌లో స్థిరపడిన నటి సన్నీ లియోన్ ఆ తర్వాత తెలుగు, తమిళ, మళయాళ సినిమాల్లో బిజీ ఆర్టిస్ట్‌గా మారారు. బాలీవుడ్‌లో జిస్మ్ 2 తో ఎంట్రీ ఇచ్చి రాగిణి MMS 2, జాక్ పాట్, హేట్ స్టోరీ 2 తో పాటు పలు సినిమాల్లో నటించారు. తెలుగులో మంచు మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన కరెంట్ తీగలో గెస్ట్ రోల్‌తో ఎంట్రీ ఇచ్చారు. కన్నడ, మళయాళ సినిమాల్లో కూడా పలు సినిమాలు చేసారు. సన్నీ లియోన్ రచయిత్రి కూడా 12 కథలతో ‘స్వీట్ డ్రీమ్స్’ అనే సంకలనంతో పాటు పలు రచనలు చేసారు. ఇవన్నీ ఇలా ఉంటే సన్నీ కొత్తగా రెస్టారెంట్ బిజినెస్‌లోకి అడుగు పెట్టారు.

Honeymoon Express : ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ సాంగ్ లాంచ్ చేసిన ఆర్జీవీ.. ఆర్జీవికి తగ్గ సాంగ్.. చూసేయండి..

సన్నీ లియోన్ తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి నోయిడాలో  ‘చికలోక’ అనే రెస్టారెంట్ ప్రారంభిస్తున్నట్లు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించారు. ఈ వీడియోలో తానే స్వయంగా పిజ్జా తయారు చేస్తూ కనిపించారు. ఈ రెస్టారెంట్‌లో త్వరలోనే వంటకాలు అందుబాటులోకి వస్తాయట. ఇటీవల కాలంలో చాలామంది సెలబ్రిటీలు ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నారు. సంపాదన కోసం కేవలం సినిమాలపైనే ఆధారపడకుండా లాభదాయకమైన వ్యాపారంపై దృష్టి పెడుతున్నారు.  సన్నీ కూడా ఇదే చెబుతున్నారు. ఆర్టిస్టులకు కేవలం టీవీ, సినిమాలకే పరిమితం కాకుండా సొంత బ్రాండ్లను విస్తరించుకోవాలని సన్నీ సూచిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ సన్నీ లియోన్ అంటున్నారు నెటిజన్లు.

 

View this post on Instagram

 

A post shared by Chica Loca Noida (@chicalocanoida)