The Warrior: నైజాం రారాజు ఆయనే అంటోన్న ది వారియర్!

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ‘ది వారియర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే.....

The Warrior: నైజాం రారాజు ఆయనే అంటోన్న ది వారియర్!

The Warrior Team Clarifies Of Nizam Rights Sold To Dil Raju

Updated On : July 10, 2022 / 5:42 PM IST

The Warrior: యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ‘ది వారియర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

The Warrior: ప్రీరిలీజ్ ఈవెంట్‌కు డేట్, టైమ్ ఫిక్స్ చేసుకున్న వారియర్

అయితే ఈ సినిమాను నైజాం ఏరియాలో హీరో రామ్ పోతినేని స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. దీంతో హీరో రామ్ డిస్ట్రిబ్యూటర్ అవతారం కూడా ఎత్తాడా అని అందరూ అనుకుంటున్నారు. కానీ, ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ది వారియర్ చిత్ర నైజాం హక్కులను స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు భారీ రేటుకు సొంతం చేసుకున్నాడని.. ఈ సినిమాను ఆయనే రిలీజ్ చేస్తాడని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

The Warrior: ది వారియర్ కోసం కదిలివస్తున్న కోలీవుడ్.. ఏకంగా 28 మంది!

దీంతో హీరో రామ్ పోతినేని డిస్ట్రిబ్యూటర్‌గా మారాడని వస్తున్న వార్తలకు చెక్ పడినట్లు అయ్యింది. ఇక రామ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ది వారియర్ చిత్రంలో అందాల భామలు కృతి శెట్టి, అక్షర గౌడ హీరోయిన్‌లుగా నటిస్తుండగా, ఈ సినిమాను జూలై 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. మరి ఈ సినిమాతో రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.