The Warrior: ది వారియర్ కోసం కదిలివస్తున్న కోలీవుడ్.. ఏకంగా 28 మంది!
యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ‘ది వారియర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.....

28 Celebrities To Grace The Warrior Pre Release Event
The Warrior: యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ‘ది వారియర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కించింది. ఈ సినిమాలో రామ్ తొలిసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, ఈ సినిమాలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.
The Warrior Trailer: హై వోల్టేజ్ ట్రైలర్‌తో ఆపరేషన్ స్టార్ట్ చేసిన రామ్!
అయితే ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోనూ తెరకెక్కించిన చిత్ర యూనిట్, ఈ సినిమా తమిళ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను జూలై 6న చెన్నైలోని సత్యం సినిమాస్‌లో ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. కాగా.. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో కోలీవుడ్‌కు చెందిన సెలబ్రిటీలు సందడి చేయబోతున్నారు. ది వారియర్ కోసం ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా 28 మంది సెలబ్రిటీలు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
The Warrior: వారియర్ కోసం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో!
వారి పేర్లను కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేసి ఈ సినిమాపై తమిళనాట కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది చిత్ర యూనిట్. జూలై 6న సాయంత్రం 6.30 నుండి ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఈ సినిమా తమిళ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వచ్చే గెస్టులు ఈ సినిమాను ఏ విధంగా ప్రమోట్ చేస్తారో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.
This is HUGE!?
MASSIVE CELEBRATIONS ON!?
Witness the STAR STUDDED GRANDIOSE #TheWarriorr (Tamil) Pre Release Event Tom from 6.30 PM at Sathyam Cinemas, Chennai?#TheWarriorrOnJuly14@ramsayz @AadhiOfficial @dirlingusamy @ThisisDSP @IamKrithiShetty @SS_Screens @adityamusic pic.twitter.com/kOZTKggUna
— #TheWarriorrOnJuly14th (@naveenkumarsayz) July 5, 2022