Theaters close : తెలంగాణలో థియేటర్లు మూసివేత?
తెలంగాణలో థియేటర్లు మళ్లీ మూసివేసే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు పంపింది.

Theaters Close
Theaters in Telangana are likely to close again : తెలంగాణలో థియేటర్లు మళ్లీ మూసివేసే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి వైద్య, ఆరోగ్య శాఖ ప్రతిపాదనలు పంపింది. ఆలస్యం చేస్తే మరింత ముప్పు ఖాయమంటూ హెచ్చరిక చేసింది. థియేటర్లు పూర్తిస్థాయిలో మూసివేత సాధ్యం కాకుంటే…50 శాతం ఆక్యుపెన్సీతో కొనసాగించాలని సూచించింది.
వరుసగా కొత్త సినిమాలు రిలీజ్ అవుతుండటంతో 90 శాతంపైగా నిండిపోతున్నాయి. ప్రేక్షకులు మాస్క్, సామాజిక దూరం పాటించకపోవడంతో…కరోనా తీవ్రత పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంది. సినిమా హళ్లలో ఏసీ, తలుపులన్నీ క్లోజ్‌గా ఉండటంతో కేసులు పెరుగుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ వివరించింది. వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించింది.
లాక్‌డౌన్ కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ గాడిన పడుతున్న టాలీవుడ్‌కు మరోసారి కరోనా టెన్షన్ పట్టుకుంది. వరుస సినిమా రిలీజ్‌లతో థియేటర్లు కళకళలాడుతున్న వేళ… కరోనా సెకండ్ వేవ్ కలకలం…సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అన్‌లాక్‌తో మెల్లిమెల్లిగా అన్ని తెరుచుకున్నా…సినిమా షూటింగ్‌లు, థియేటర్లు ఓపెన్ అవడంతో ఆలస్యం అయింది.
గత ఏడాది డిసెంబర్‌లో 50 శాతం ఆక్యుపెన్సీతో ఓపెన్ అయ్యాయి. తర్వాత వందశాతం అనుమతి ఇచ్చారు. అయితే ప్రేక్షకులు మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. సంక్రాంతి సీజన్‌తో …పెద్ద సినిమాలు రావడంతో థియేటర్స్ కలకళలాడాయి. దీంతో సినిమాల జోరు కనిపించింది.
షూటింగ్‌లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇండస్ట్రీ ట్రాక్ మీద పడ్డట్టే అనుకుంటున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ రూపంలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మళ్ళీ ఉత్తరాది రాష్ట్రాలలో విజృంభిస్తున్న కరోనా..దక్షిణాది రాష్ట్రాలలో పెరుగుతున్న కేసులతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో వణుకు మొదలైంది.