Movie Shootings : ఈ సినిమాలు షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నాయిగా.. అన్ని సినిమాలు ఇంత ఫాస్ట్ గా చేస్తే బాగుండు..
కొన్ని సినిమాలు మాత్రం అసలు షూటింగ్ మొదలుపెట్టిందే లేటు ఎక్కడా బ్రేక్ లేకుండా నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో పరుగులు పెట్టిస్తున్నారు.

These Movies Doing Shootings in Super Fast
Movie Shootings : కొన్ని సినిమాలు సంవత్సరాలు సంవత్సరాలు షూటింగ్ జరుపుకుంటూ రిలీజ్ అన్న ఊసే ఎత్తకుండా ఉంటే కొన్ని సినిమాలు మాత్రం అసలు షూటింగ్ మొదలుపెట్టిందే లేటు ఎక్కడా బ్రేక్ లేకుండా నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో పరుగులు పెట్టిస్తున్నారు.
బుచ్చిబాబు చరణ్ సినిమాని పరుగులు పెట్టిస్తున్నారు. మూడ్నెల్ల క్రితం మొదలైన రామ్ చరణ్ 16వ సినిమా ఇప్పటికే 40 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. షూటింగ్ మొదలుపెట్టిన దగ్గరనుంచి వరస షెడ్యూల్స్ తో షూటింగ్ చేస్తున్న బుచ్చిబాబు రీసెంట్ గా శివరాజ్ కుమార్ తో కూడా షూటింగ్ స్టార్ట్ చేసినట్టు అనౌన్స్ చేశారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ తో నైట్ షూట్స్ చేస్తున్నారట. ఈ సినిమాని చాలా ఫాస్ట్ గా పూర్తిచేసి ఎలాగైనా దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Also Read : Sreeleela Dance : అక్కడ పనిచేస్తున్న మహిళలతో శ్రీలీల క్యూట్ డ్యాన్స్ చూశారా..? వీడియో వైరల్..
సినిమాలు సంవత్సరాలు సంవత్సరాలు చెయ్యడం అంటే రాజమౌళి తర్వాతే ఎవరైనా. ఏళ్లపాటు చెక్కుతారు కాబట్టే జక్కన్న అని కూడా అంటారు రాజమౌళిని. అలాంటి రాజమౌళి ఈ సారి మాత్రం సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారు. మహేష్ – రాజమౌళి సినిమా మొదలవ్వడం ఆలస్యమయింది కాని షూటింగ్ మొదలయ్యాక పరుగులు పెడుతుంది. ఇప్పటికే సెట్స్ మీదకెళ్లిన దగ్గరనుంచి బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ చేస్తున్న రాజమౌళి లేటెస్ట్ గా ఈ సినిమా షూటింగ్ ఒడిశాలో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లో ప్రియాంకా చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ కూడా జాయిన్ అయ్యారు.
ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మొదలైన సినిమా కూడా షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్ లేకుండానే భారీ యాక్షన్ షూట్ మొదలుపెట్టిన ప్రశాంత్ నీల్ సినిమా ఊపందుకుంటోంది. ఎందుకంటే వార్ 2 కి సంబంధించి హృతిక్ కి చిన్న యాక్సిడెంట్ అయ్యి 4 వారాల రెస్ట్ చెప్పడంతో ప్రస్తుతానికి షూట్ ఆగిపోయినట్టే. దాంతో ప్రశాంత్ నీల్ సినిమా స్పీడప్ అవ్వడం గ్యారంటీ. వన్స్ ఎన్టీఆర్ షూట్ లో జాయిన్ అయ్యారంటే ఇక ఆ జోషే వేరు.
Also Read : Aamir Khan : మళ్ళీ సౌత్ సినిమాల మీద కుళ్లుకున్న బాలీవుడ్ రైటర్.. కౌంటర్ ఇచ్చిన ఆమీర్ ఖాన్..
వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ స్పీడ్ మీదున్నాడు ప్రభాస్. లవ్ స్టోరీస్ లను ఎంతో స్పెషల్ గా తెరకెక్కించే హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ సినిమా చేస్తున్నారు డార్లింగ్. పీరియాడికల్ మూవీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో భారీ స్టార్ కాస్ట్ ను ఇన్వాల్వ్ చేశారు డైరెక్టర్ హను రాఘవపూడి. మరో పక్క రాజాసాబ్ కూడా ఫైనల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలు కంప్లీట్ అయితే కానీ సలార్ 2, కల్కి 2, స్పిరిట్ సినిమాలు స్టార్ట్ చెయ్యాల్సి ఉంది.
సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేసే విషయంలో బాలకృష్ణ తర్వాతే ఎవరైనా. చేతిలో ఒక్క సినిమానే ఉంచుకొని ఒకటి అయిన తర్వాత ఒకటి చేస్తూనే ఉంటారు బాలయ్య. బోయపాటి, బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న అఖండ 2 సినిమా మహాకుంభమేళాలో స్టార్ట్ అయ్యింది. అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూడకుండా బ్యాక్ టూ బ్యాక్ షూటింగ్స్ చేస్తోంది బోయపాటి అండ్ టీమ్. అంతేకాదు ఇంటెన్సిటీ కోసం హిమాలయాల్లో షూట్ చెయ్యడానికి కూడా రెడీ అవుతున్నారు యూనిట్. మరో 6 నెలల్లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ప్రస్తుతం శంకర్ పల్లి లో షూటింగ్ జరుగుతోంది.
నాని కూడా తన సినిమాల్ని జెట్ స్పీడ్ లో షూట్ చేస్తున్నారు. హిట్ 3 సినిమాని మొదలుపెట్టి ఇప్పటికే క్లైమాక్స్ కి తెచ్చేసిన నాని ఇప్పుడు ప్యారడైజ్ మూవీని స్టార్ట్ చేసేశారు. ఈసినిమాకు సంబంధించి రిలీజైన ఫస్ట్ స్టేట్ మెంట్ ఇప్పటికే టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. నాని కెరీర్ లో మాస్ ఇమేజ్ ఇచ్చిన దసరా కాంబినేషన్ రిపీట్ అవ్వడం, అదికూడా సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకోవడంతో అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్యారడైజ్ రిలీజ్ కి ఇంకా సంవత్సరం టైమున్నా ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా చకచకా షూట్ చేస్తున్నారు శ్రీకాంత్ ఓదెల, నాని. దీంతో మిగిలిన హీరోల ఫ్యాన్స్ తమ హీరోల సినిమాలు కూడా ఇంత ఫాస్ట్ గా చేయొచ్చు కదా అని సోషల్ మీడియాలో మూవీ టీమ్స్ ని అడుగుతున్నారు.