నవంబర్ 8న శ్రీవిష్ణు ‘తిప్పరామీసం’
శ్రీవిష్ణు, నిక్కీ థంబోలి జంటగా ‘అసుర’ ఫేమ్ కృష్ణ విజయ్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘తిప్పరామీసం’ నవంబర్ 8న ప్రేక్షకల ముందుకు రానుంది..

శ్రీవిష్ణు, నిక్కీ థంబోలి జంటగా ‘అసుర’ ఫేమ్ కృష్ణ విజయ్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘తిప్పరామీసం’ నవంబర్ 8న ప్రేక్షకల ముందుకు రానుంది..
హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా, డిఫరెంట్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ.. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. ‘బ్రోచేవారెవరురా’ తర్వాత అతను నటిస్తున్న సినిమా ‘తిప్పరామీసం’.
రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై, రిజ్వాన్ నిర్మాణంలో, ‘అసుర’ ఫేమ్ కృష్ణ విజయ్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘తిప్పరామీసం’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. నిక్కీ థంబోలి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా నవంబర్ 8న ప్రేక్షకల ముందుకు రానుంది.
Read Also : దీపావళి రేసు నుండి తప్పుకున్న ‘సంగ తమిళన్’
రెండు తెలగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ఏషియన్ సినిమాస్ సొంతం చేసుకుంది. సమర్పణ : శ్రీఓమ్ సినిమా, కెవిఎల్‌పి ప్రొడక్షన్స్, సంగీతం : సురేష్ బొబ్బిలి, కో-ప్రొడ్యూసర్స్ : ఖుషి, అచ్యుత్ రామారావు.