Poonakaalu Loading: ‘పూనకాలు లోడింగ్’ సాంగ్ ప్లే చేసే థియేటర్ల లిస్ట్ ఇదే
శుక్రవారం ఈ చిత్రం నుంచి మరో పాట కూడా విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ‘పూనకాలు లోడింగ్’ పేరుతో రూపొందిన ఈ పాట శుక్రవారం సాయంత్రం విడుదల కానుంది. ఈ పాటలో చిరంజీవి, రవితేజ కలిసి స్టెప్పులేయడం విశేషం.

Poonakaalu Loading: ‘మెగాస్టార్’ చిరంజీవి, ‘మాస్ మహారాజ్’ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. చిరంజీవి, రవితేజ కలిసి నటిస్తుండటం కూడా ఈ చిత్రంపై అంచనాలు పెంచేస్తోంది.
Waltair Veerayya : ‘పూనకాలు’ తెప్పించేందుకు చిరు, రవితేజ సై..
ఇప్పటికే విడుదలైన చిత్రంలోని మూడు పాటలు ఆకట్టుకుంటున్నాయి. కాగా, శుక్రవారం ఈ చిత్రం నుంచి మరో పాట కూడా విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ‘పూనకాలు లోడింగ్’ పేరుతో రూపొందిన ఈ పాట శుక్రవారం సాయంత్రం విడుదల కానుంది. ఈ పాటలో చిరంజీవి, రవితేజ కలిసి స్టెప్పులేయడం విశేషం. దీంతో ఈ పాట కోసం ఇటు మెగా ఫ్యాన్స్, అటు రవితేజ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మాస్ సాంగ్‌గా రాబోతున్న ఈ సాంగ్ ఫ్యాన్స్‌తో స్టెప్స్ వేయించేలా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, ఈ సాంగ్‌ను చిత్ర యూనిట్ థియేటర్లలో కూడా విడుదల చేయనుంది. ఈ మేరకు యూనిట్ ప్రకటన విడుదల చేసింది.
శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు సాంగ్ వివిధ థియేటర్లలో ప్రదర్శిస్తారు. ఈ థియేటర్ల లిస్ట్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. హైదరాబాద్ (సంధ్య 70 ఎంఎం), నెల్లూర్ (ఎమ్1 సినిమాస్), అనంతపూర్ (ఎస్‌వీ సినీమ్యాక్స్), రాజమండ్రి (స్వామి), గుంటూర్ (భాస్కర్), విజయవాడ (జైరామ్) థియేటర్లలో సాంగ్ ప్రదర్శిస్తారు. దీంతో ఈ థియేటర్లలో హంగామా చేసేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి జనవరి 13న విడుదల కానుంది.