NTR – Ram Charan : ఎన్టీఆర్ అండ్ చరణ్ తో కలిసి నటించడం అదృష్టం అంటున్న థోర్..

థోర్, అవెంజర్స్ సినిమాలతో ఇండియన్ ఆడియన్స్ కి పరిచయమైన క్రిస్‌.. ఎన్టీఆర్ అండ్ చరణ్ తో కలిసి నటించడం అదృష్టం అంటూ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

NTR – Ram Charan : ఎన్టీఆర్ అండ్ చరణ్ తో కలిసి నటించడం అదృష్టం అంటున్న థోర్..

Thor Actor Chris Hemsworth comments on Ram Charan and NTR Extraction 2

Updated On : June 9, 2023 / 2:43 PM IST

Chris Hemsworth : మన టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ RRR సినిమాతో వరల్డ్ వైడ్ పాపులారిటీని సంపాదించుకున్నారు. తమ యాక్టింగ్ తో హాలీవుడ్ మేకర్స్ అండ్ యాక్టర్స్ ని సైతం మెస్మరైజ్ చేసేశారు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి ఏడాది పూర్తి అవుతున్నా ఇంకా ఆ మ్యానియా కొనసాగుతూనే ఉంది. కొన్ని రోజులు నుంచి హాలీవుడ్ లోని స్టార్ హీరోలు పలు ఇంటర్వ్యూలో RRR మరియు హీరోలు గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల స్పైడర్ మ్యాన్ నటుడు టామ్ హాలండ్ (Tom Holland).. “రీసెంట్ గా RRR సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది” అంటూ చెప్పుకొచ్చాడు.

Varun – Lavanya : వరుణ్ – లావణ్య నిశ్చితార్థం.. ఎక్కడో తెలుసా? వాళ్ళు మాత్రమే హాజరవుతున్నారట..

అలాగే ట్రాన్స్ఫార్మర్స్ (Transformers) నటుడు మరియు ప్రముఖ ర్యాపర్ టాబ్ న్విగ్వే (Tobe Nwigwe).. RRR చాలా బాగా నచ్చిందంటూ చెబుతూ కుదిరితే RRR పార్ట్ 2 లో తానూ నటించడానికి సిద్ధమని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా థోర్ (Thor) నటుడు క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ కూడా ఒక ఇంటర్వ్యూలో ఆర్ఆర్ఆర్, చరణ్ అండ్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. థోర్, అవెంజర్స్ సినిమాలతో ఇండియన్ ఆడియన్స్ కి పరిచయమైన క్రిస్‌.. 2020 లో ఎక్సట్రాక్షన్ (Extraction 2) అనే యాక్షన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు హిట్టుని అందుకున్నాడు.

Bhagavanth Kesari Teaser : ‘భగవంత్ కేసరి’ టీజర్‌‌కి మొత్తం రెడీ.. ఫ్యాన్స్‌కి సూపర్ సర్‌ప్రైజ్ అంటున్న అనిల్, తమన్.. 108 థియేటర్స్ లో..

ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ రాబోతుంది. ఎక్సట్రాక్షన్ 2 జూన్ 16న రిలీజ్ కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ లో ఉన్న క్రిస్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “రీసెంట్ గా RRR సినిమా చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ఒకవేళ ఛాన్స్ వస్తే ఆ సినిమాలో నటించిన ఇద్దరు యాక్టర్స్ (ఎన్టీఆర్ అండ్ చరణ్) తో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక క్రిస్ వంటి సూపర్ స్టార్ ఈ కామెంట్స్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.