Threat Emails: రజనీకాంత్, ధనుష్ ఇళ్లకు బాంబు బెదిరింపు.. డీజీపీ ఆఫీసుకి బెదిరింపు మెయిల్
తమిళ ఇండస్ట్రీ స్టార్స్ రజనీకాంత్, ధనుష్ నివాసాలకు బాంబు బెదిరింపులు(Threat Emails) రావడం చెన్నైలో కలకలం రేపింది
threat emails to Rajinikanth and Dhanush Home
- తమిళ సినీ ఇండస్ట్రీలో బాంబు కలకలం
- సూపర్ స్టార్, ధనుష్ నివాసాల్లో ముమ్మర సోదాలు
- అది ఫేక్ మెయిల్ అని తేల్చిన పోలీసులు
Threat Emails: తమిళ ఇండస్ట్రీ స్టార్స్ రజనీకాంత్, ధనుష్ నివాసాలకు బాంబు బెదిరింపులు రావడం చెన్నైలో కలకలం రేపింది. రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి అందిన ఒక ఈమెయిల్(Threat Emails) ద్వారా ఈ దుశ్చర్యకు పాల్పడతామని ఆగంతకులు హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆ ఇద్దరు హీరోల ఇళ్లలో గంటలపాటు ముమ్మరంగా సోదాలు నిర్వహించారు.
Punarnavi Bhupalam: పెళ్లినాటి స్పెషల్ మూమెంట్స్.. భర్తతో క్యూట్ ఫోటోలు షేర్ చేసిన పునర్నవి
అయితే, ఈ గాలింపు చర్యల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అధికారులు అది కేవలం ఆకతాయిల పనిగా తేల్చారు. అణువణువూ గాలించి ఆ బెదిరింపు ఫేక్ అని నిర్ధారించడంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మెయిల్ పంపిన మూలాలను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం రంగంలోకి దిగింది. నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తూ, ముందుజాగ్రత్తగా వారి నివాసాల వద్ద భద్రతను పెంచారు.
