Tiger Nageswara Rao : అరుదైన ఘనతను సొంతం చేసుకున్న రవితేజ మూవీ.. భారతీయ సినీ చరిత్రలో..
మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో నటించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు.

Tiger Nageswara Rao
Tiger Nageswara Rao – Ravi Teja : చాలా మంది సరదా కోసం సినిమాలను చూస్తుంటారు. కుదిరితే థియేటర్స్ వీలులేకపోతే ఓటీటీలలో మూవీలను ఆస్వాదిస్తుంటారు. అయితే.. మనలాగా వినలేని, మాట్లాడలేని(బధిరుల) పరిస్థితి ఏంటి? వాళ్లు కూడా సినిమాలు చూడొచ్చా..? అనే ప్రశ్నలు ఉండేవి. వారి కోసం సైన్ లాంగ్వేజ్ ఉన్నప్పటికీ.. ఇప్పటి వరకు దానిపై పెద్దగా ఎవ్వరూ దృష్టి పెట్టలేదు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. గతేడాది దసరా కానుకగా ఈ చిత్రం ప్రేకకుల ముందుకు వచ్చింది. గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. అయితే.. తాజాగా ఈ మూవీ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సైన్ ల్వాంగేజ్‌లో ఈ మూవీని ఓటీటీలో అందుబాటులోకి తీసుకువచ్చారు.
భారతీయ సినీ చరిత్రలో సైన్ లాంగ్వేజ్‌లో ఓటీటీలో విడుదలైన మొదటి సినిమా టైగర్ నాగేశ్వరరావు రికార్డులకు ఎక్కింది. ఈ చిత్రంలోని పాటలు, సౌండ్ లాంటివి వినలేకపోవచ్చు కానీ.. కథేంటి? డైలాగ్స్ ఏంటి అనేవి దివ్యాంగులకు కూడా తెలుస్తాయి.
A new chapter in inclusivity in Indian Cinema ✨#TigerNageswaraRao is the ????? ?????? ???? to have an OTT Release in the ?????? ???? ???????? ❤️?
Streaming now on @PrimeVideoIN ?https://t.co/DRlEkcygtu
Mass Maharaja @RaviTeja_offl @DirVamsee… pic.twitter.com/FOnWe5PdsH
— ??????????? (@UrsVamsiShekar) May 27, 2024
ఈ చిత్రంలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ లు హీరోయిన్లుగా నటించగా రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ కీలక పాత్రలను పోషించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఈ మూవీని నిర్మించగా జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు.