అత్తగారి ఊరిలో నిఖిల్ దంపతుల షికారు

  • Published By: madhu ,Published On : August 20, 2020 / 08:52 AM IST
అత్తగారి ఊరిలో నిఖిల్ దంపతుల షికారు

Updated On : August 20, 2020 / 9:16 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో..నిఖిల్..అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ..తన భార్య పల్లవి వర్మతో షికార్లు చేస్తున్నాడు. తూర్పు గోదావరి జిల్లాలో భీమవరం, పాలకొల్లు ప్రాంతాల్లో షికారు చేస్తూ..పచ్చని తోటల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడి గోదావరి వంటకాలను ఆరగిస్తున్నాడు.



ఈ సందర్భంగా న్యూ కపుల్స్ దిగిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. లాక్ డౌన్ కారణంగా సినిమాలు షూటింగ్ బంద్ కావడం, చేతిలో పని లేకపోవడంతో సరదాగా..అత్తారింటికి వెళ్లాడు నిఖిల్.

ఇటీవలే…తన స్నేహితురాలు పల్లవి శర్మను నిఖిల్ వివాహమాడిన సంగతి తెలిసిందే. ఎంతో గ్రాండ్ గా పెళ్లి చేసుకుందామని నిఖిల్ అనుకున్నా కరోనా కారణంగా వీలు పడలేదు.



మే 14వ తేదీన ఉదయం శామిర్ పేటలోని ఓ ప్రైవైట్ గెస్ట్ హౌస్ లో నిరాడంబరంగా పెళ్లి జరిగింది. నిఖిల్ – డాక్టర్ పల్లవి వర్మకు కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. హ్యాపీడేస్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన నిఖిల్ కు స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.