సినీ పుత్రుడు : కోడి రామకృష్ణ మృతిపై పలువురు సంతాపం

  • Published By: madhu ,Published On : February 22, 2019 / 01:59 PM IST
సినీ పుత్రుడు : కోడి రామకృష్ణ మృతిపై పలువురు సంతాపం

Updated On : February 22, 2019 / 1:59 PM IST

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మృతిపట్ల సినీ, రాజకీయ, ఇతర ప్రముఖులు ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ..సోషల్ మాధ్యమాల్లో ట్వీట్లు చేశారు. ఓ గొప్ప దర్శకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 22వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం కోడి రామకృష్ణ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా పెరలాసిస్ వ్యాధితో బాధ పడుతున్నారు. గచ్చిబౌలి లోని ఏఐజి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని ఫిబ్రవరి 23వ తేదీ శనివారం అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్‌లో ఉదయం 11.30గంటలకు ఉంచనున్నారు. మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. 

కోడి రామకృష్ణ భౌతికకాయానికి పలువురు నివాళులర్పించారు. తెలంగాణ మంత్రి తలసాని, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిలు నివాళులర్పించారు. చిరంజీవీ, జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, బాలకృష్ణ, నాని, మహేష్ బాబు, దేవీ శ్రీ ప్రసాద్, దగ్గుబాటి సురేష్ బాబు, పరుచూరి గోపాలకృష్ణలతో పాటు ఇతరులు సంతాపం తెలియచేశారు. 

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడులు సంతాపం తెలియచేశారు. గ్రామీణ ప్రాంత నేపథ్యంతో కూడిన చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారని…ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటుగా బాబు పేర్కొన్నారు. సినీ రంగంలో తనదైన శైలితో ఎన్నోచిత్రాలను తెరకెక్కించి, 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రత్యేక గుర్తింపు పొందారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు.

కోడి రామక‌ృ‌ష్ణ కుటుంబసభ్యులకు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత జగన్ సానుభూతి తెలియచేశారు. 
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. చిరంజీవితో కోడి రామకృష్ణ అద్బుతమైన సినిమాలు తీశారని, ఆయన మృతి సినిమా పరిశ్రమకు తీరనిలోటు అని పేర్కొన్నారు. 
కోడి రామకృ‌ష్ణ చిత్రాల్లో ఎక్కువగా సామాజీక చిత్రాలే ఉన్నాయని దర్శకుడు పరుచూరి గోపాలకృ‌ష్ణ వెల్లడించారు. సినీ పరిశ్రమలో తనకంటూ ఓ పేజీ రాసుకున్న గొప్ప దర్శకుడు అని కొనియాడారు. 
కోడి రామకృష్ణ ఇకలేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు సినీ నటుడు చిరంజీవి తెలిపారు. ఆయనతో 34 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన అంకుశం సినిమా ఇష్టమన్నారు. 
కోడి రామకృష్ణ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నట్లు…కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను తెలిపారు. 
కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో శత్రువు, దేవీపుత్రుడు సినిమాలు చేసినట్లు..చాలా డిఫరెంట్ సినిమాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా అందరినీ మెప్పించారని సినీ నటుడు వెంకటేష్ సంతాపం వ్యక్తం చేశారు. మేటి డైరెక్టర్‌ని కోల్పోవడం బాధాకరమన్నారు. 
కోడి రామకృష్ణ మృతి పట్ల టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు సంతాపం తెలియచేశారు. తెలుగు ప్రేక్షక లోకానికి తీరని లోటన్నారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. 
రామకృష్ణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు లక్ష్మీపార్వతి తెలిపారు. కష్టాల్లో ఉన్నప్పుడు కోడి రామకృష్ణ అండగా నిలిచారని, అద్భుతమైన సినిమాలు తీశారని మెచ్చుకున్నారు. 
వీరితో పాటు ఎంతోమంది సంతాపం తెలియచేశారు. ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. ఆయనతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. 

Read Also: డోంట్ ఫాలో : రంభ, రాశీ బ్యూటీ యాడ్స్ బ్యాన్
Read Also: షారుక్ కు డాక్టరేట్ ఇచ్చేందుకు నిరాకరించిన కేంద్రం