Sanjana Anne : దర్శకురాలిగా మారబోతున్న టాలీవుడ్ హీరోయిన్..

దర్శకురాలిగా మారబోతున్న టాలీవుడ్ హీరోయిన్. సినిమాకి కథని కూడా తానే రాస్తూ..

Sanjana Anne : దర్శకురాలిగా మారబోతున్న టాలీవుడ్ హీరోయిన్..

Tollywood Actress Sanjana Anne is becoming a director

Updated On : February 20, 2024 / 7:26 PM IST

Sanjana Anne : సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు కనిపించడం అనేది.. ఒకప్పుడు చాలా అరుదైన విషయం. కానీ ఇప్పుడు రోజులు మారాయి. తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి మంచి ఆసక్తి చూపించడం కనిపిస్తుంది. అయితే అమ్మాయిలంటే అందాలు చూపిస్తూ హీరోయిన్స్ గానే కాదు, కథలు రాసి డైరెక్ట్ చేసే సత్తా కూడా కలిగి ఉంటారని కొందరు నిరూపిస్తున్నారు.

ఈక్రమంలోనే ఇటీవల ఓ తెలుగు అమ్మాయి రైటర్‌గా, నిర్మాతగా ఓ సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం చేస్తుంది. తాజాగా మరి తెలుగు అమ్మాయి మెగా ఫోన్ పట్టుకొని దర్శకురాలిగా సినిమా తెరకెక్కించబోతున్నారు. తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ‘సంజన అన్నే’.. ఇప్పుడు డైరెక్టర్ గా భాద్యతలు తీసుకుబోతున్నారు.

Also read : Trisha : త్రిషపై పొలిటికల్ లీడర్ చీప్ కామెంట్స్.. లీగల్‌గా చూసుకుంటా అంటున్న హీరోయిన్..

ఈ సినిమాలో సిరి చౌదరి, పింక్ పాక్ సూర్య, జబర్దస్త్ అభి, భారత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథని కూడా సంజన అన్నే అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ.. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. త్వరలోనే మూవీకి సంబంధించిన అన్ని వివరాలను తెలియజేయనున్నారు. కాగా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే కొందరు లేడీ డైరెక్టర్స్ వచ్చి ఆడియన్స్ కి తమ సత్తా చూపించారు.

నందిని రెడ్డి, లక్ష్మీ సౌజన్య, గౌరీ వంటి దర్శకురాలు తమ సినిమాలతో ఆడియన్స్ ని మెప్పించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు సంజన అన్నే కూడా అలాగే ఆకట్టుకొని ఆడియన్స్ లో మంచి గుర్తింపుని సంపాదించుకుంటారో లేదో చూడాలి.