HanuMan : హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ మీద పడ్డట్టు.. ‘హనుమాన్’ దెబ్బ ఓం రౌత్‌కి పడుతుంది..

'హనుమాన్' సక్సెస్ అవ్వడంతో ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ పరిస్థితి ప్రస్తుతం.. హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ మీద పడ్డట్టు అయ్యిపోయింది.

HanuMan : హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ మీద పడ్డట్టు.. ‘హనుమాన్’ దెబ్బ ఓం రౌత్‌కి పడుతుంది..

Tollywood and Prabhas Fans troll again Om Raut after see Hanuman movie graphics

Updated On : January 12, 2024 / 10:18 AM IST

HanuMan : టాలీవుడ్ యంగ్ టాలెంట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన కొత్త సినిమా ‘హనుమాన్’తో అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు. రిలీజ్ కి ముందు ప్రశాంత్ మాటలు విని ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో అనుకున్నారు. కానీ సినిమా చూసిన తరువాత అది తన టాలెంట్ పై ఉన్న నమ్మకమని తెలిసింది. ట్రైలర్ అండ్ టీజర్ లో ఏ విజువల్స్ తో ఆకట్టుకున్నారో.. మూవీ మొత్తం కూడా అదే రేంజ్ క్వాలిటీ విజువల్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు.

కేవలం 30 కోట్ల బడ్జెట్ తో 100 కోట్ల విజువల్స్ ని ఇచ్చి వావ్ అనిపించారు. ఈ సినిమా గురించి ఎవరైనా మాట్లాడుతుంటే.. ముందుగా గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ గురించి చెబుతున్నారు. సినిమాలో చాలా వరకు గ్రాఫిక్స్ షాట్స్, VFX సీన్స్ వాడారు. VFX ఉన్న అన్ని సీన్స్, షాట్స్ చాలా నేచురల్‌గా బాగుంటాయి. కొన్ని గ్రాఫిక్స్ సన్నివేశాలు అయితే గూస్ బంప్స్ తెప్పిస్తాయి.

Also read : Prashanth Varma : చిరంజీవి పై కామెంట్స్ చేస్తున్న వారికి.. గట్టి కౌంటర్ ఇచ్చిన ‘హనుమాన్’ డైరెక్టర్..

ముఖ్యంగా ఆంజనేయస్వామి షాట్స్ ఆడియన్స్ ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే.. సినిమాలో చాలా సీన్స్ ఉన్నాయి. ఇక ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత క్వాలిటీ అవుట్ ఫుట్ చూసిన ఆడియన్స్.. ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ ని టార్గెట్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని రాముడిగా చూపిస్తూ.. రామాయణం తెరకెక్కిస్తున్నానంటూ ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ అందరికి విసుగు తెప్పించింది.

రామాయణ కథని చెడగొట్టడమే కాకుండా, దాదాపు 700 కోట్ల వరకు ఖర్చు పెట్టి బొమ్మల గ్రాఫిక్స్ చూపించి నిరాశపరిచారు. ఆదిపురుష్ గ్రాఫిక్స్ తో పోలిస్తే.. హనుమాన్ గ్రాఫిక్స్ 100 శాతం కూడా 1000 శాతం బెటర్ అంటున్నారు. దీంతో తెలుగు ఆడియన్స్, ప్రభాస్ ఫ్యాన్స్.. ఓం రౌత్ ని సోషల్ మీడియాలో మరోసారి ట్రోల్ చేస్తున్నారు. ఒకసారి హనుమాన్ సినిమా చూడండి అంటూ ఓం రౌత్ ని ట్యాగ్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఓం రౌత్ పరిస్థితి.. హీరో విలన్ కొట్టుకొని కమెడియన్ మీద పడ్డట్టు అయ్యిపోయింది.