Allu Arjun: అల్లు అర్జున్ ఇంటికి సినీ ప్రముఖులు.. ఆ హీరోలు ఎక్కడ..? టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ
అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తరువాత పలువురు సినీ ప్రముఖులు, సినీ హీరోలు, రాజకీయ ప్రముఖులు ఆయన అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఆయన అరెస్టు సరైంది కాదని అన్నారు.

allu arjun
Allu Arjun: పుష్ప2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో పోలీసులు సినీ హీరో అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా కోర్టు 14రోజులు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయన్ను శుక్రవారం సాయంత్రం చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో శనివారం ఉదయం ఆయన జైలు నుంచి విడుదలై ఇంటికి వెళ్లారు. దీంతో అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు సినీ ప్రముఖులు ఆయన నివాసానికి క్యూ కట్టారు. వీరిలో దర్శకులు కే. రాఘేవంద్రరావు, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నిర్మాలు నవీన్, రవి, దిల్ రాజు, హీరోలు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, రానా తదితరులు ఉన్నారు.
Also Read: Allu Arjun : అల్లు అర్జున్‌ను చూసి భావోద్వేగానికి గురైన కుటుంబ సభ్యులు..
అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తరువాత పలువురు సినీ ప్రముఖులు, సినీ హీరోలు, రాజకీయ ప్రముఖులు ఆయన అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఆయన అరెస్టు సరైంది కాదని అన్నారు. సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విటర్ వేదికగా అరెస్టును ఖండించారు. పుష్కరాలు, బ్రహ్మోత్సవాల వంటి ఉత్సవాల్లో తోపులాటలో భక్తులు చనిపోతే దేవుళ్ళని అరెస్ట్ చేస్తారా? అంటూ ప్రశ్నించారు. భద్రత ఏర్పాట్ల అంశం పోలీసులు, ఆర్గనైజర్లదే తప్ప సినిమా హీరోలు, ప్రజా నాయకులు ఎలా కంట్రోల్ చేయగలరు అంటూ వర్మ ప్రశ్నించారు. మరోవైపు అరెస్టు విషయం తెలిసిన వెంటనే సినిమా షూటింగ్ ను క్యాన్సిల్ చేసుకొని మెగాస్టార్ చిరంజీవి దంపతులు, నాగబాబు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం అల్లు అర్జున్ నివాసానికి వస్తున్నారని శుక్రవారం ప్రచారం జరిగింది.
Also Read; Allu Arjun: చంచల్‌గూడ జైలు నుంచి సినీ హీరో అల్లు అర్జున్ విడుదల
అయితే, టాలీవుడ్ లో ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది. అల్లు అర్జున్ అరెస్టు కావడం, జైలుకెళ్లడం, విడుదలవ్వడం 24గంటల్లోనే జరిగిపోయాయి. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖులు ఆయన అరెస్టుపై స్పందించడంతోపాటు తీవ్రంగా ఖండిస్తున్నారు. మెగా ఫ్యామిలీలో చిరంజీవి, నాగబాబు మినహా మిగిలిన హీరోలు అల్లు అర్జున్ ఇష్యుపై స్పందించలేదన్న చర్చ జరుగుతుంది. గత కొద్దికాలంగా అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీకి మధ్య సత్సంబంధాలు లేవనేది ప్రచారంలో ఉంది. ఇరు వర్గాల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా తారాస్థాయిలో మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మెగా హీరోలు అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించలేదన్న వాదన ఉంది. అయితే, ఈ వాదనను పలువురు మెగా అభిమానులు ఖండిస్తున్నారు. మెగా ఫ్యామిలీ హీరోలు వారివారి సినిమాల్లో బిజీగా ఉన్నారని.. అందుకే రాలేకపోయారని పేర్కొంటున్నారు. అల్లు అర్జున్, వారి ఫ్యామిలీ మెంబర్స్ తో ఫోన్లో మాట్లాడి దైర్యం చెప్పినట్లు పేర్కొంటున్నారు. మొత్తానికి చిరంజీవి, నాగబాబు మినహా మెగా ఫ్యామిలీ హీరోలు అల్లు అర్జున్ అరెస్టు విషయంపై స్పందించక పోవటం, ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించక పోవటం చూస్తుంటే ఇరు కుటుంబాల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయా అనేఅశంపై టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.