Tollywood Corona: టాలీవుడ్‌ను పట్టిపీడిస్తున్న కరోనా రాకాసి.. ఆ 2 సినిమాలు కూడా

బాలీవుడ్ మాదిరి.. టాలీవుడ్‌లోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇటీవల అగ్ర నిర్మాత అల్లు అరవింద్, రచయిత విజయేంద్ర ప్రసాద్..

Tollywood Corona: టాలీవుడ్‌ను పట్టిపీడిస్తున్న కరోనా రాకాసి.. ఆ 2 సినిమాలు కూడా

Tollywood Corona (1)

Updated On : April 13, 2021 / 11:46 AM IST

Tollywood Corona: బాలీవుడ్ మాదిరి.. టాలీవుడ్‌లోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇటీవల అగ్ర నిర్మాత అల్లు అరవింద్, రచయిత విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు త్రివ్రికమ్, హీరోయిన్ నివేదా థామస్‌లు కరోనాకు గురికాగా, తాజాగా నిర్మాత ‘దిల్‌’ రాజు, దర్శకులు గుణశేఖర్, వీఎన్ ఆదిత్య పేర్లు చేరాయి.

కరోనా లక్షణాలేవీ కనిపించకుండా పరీక్షల్లో ‘దిల్‌’ రాజుకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దాంతో ఆయన ఐసోలేషన్ కు వెళ్లిపోగా.. ‘శాకుంతలం’ దర్శకుడు గుణశేఖర్‌కు సైతం కరోనా పాజిటివ్‌ అని సోమవారం సాయంత్రానికి తెలిసింది. గతవారం ఓ స్టూడియోలో పవన్‌కల్యాణ్‌ – హరీశ్‌ శంకర్‌‌ల కొత్త చిత్రానికి సంబంధించి ఫోటోషూట్‌ జరుగుతుంటే, అక్కడకు వెళ్ళిన దిల్ రాజు.. పవన్‌కల్యాణ్‌ను కలిశారు.

పక్కనే స్వీయ సమర్పణలో షూటింగ్‌ జరుగుతున్న ‘శాకుంతలం’ సెట్స్‌కు కూడా వెళ్ళి వచ్చారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌ హోమ్‌ క్వారంటైన్‌లోకి వెళ్ళారు. ఆలస్యంగా పాజిటివ్‌ అయిన గుణశేఖర్‌ కూడా క్వారంటైన్‌ లో ఉండాల్సిన పరిస్థితి. ఇలా ‘శాకుంతలం’ షూటింగ్‌ కొన్నాళ్ళ పాటు ఆగిపోయే వాతావరణం కనిపిస్తుంది.

మరోపక్క ఏప్రిల్ 23న రిలీజ్ కావాల్సిన నాని ‘టక్‌ జగదీశ్‌’ సైతం టాలీవుడ్ కరోనా ఎఫెక్ట్‌కు వాయిదా పడింది.