Craze Combinations: ఎట్టకేలకు సెట్స్ మీదకి రాబోతున్న హాట్ కాంబోస్!

ఎప్పటినుంచో ఎదురుచూస్తోన్న కొన్ని హీరో - డైరెక్టర్ క్రేజీ కాంబినేషన్స్.. అతిత్వరలో సెట్స్ పైకెళ్లబోతున్నాయి. సినిమా ప్రకటించాక కొవిడ్ బ్రేక్ కారణంగా అప్పటికే చేస్తున్న సినిమాలు..

Craze Combinations: ఎట్టకేలకు సెట్స్ మీదకి రాబోతున్న హాట్ కాంబోస్!

Craze Combinations

Updated On : March 13, 2022 / 11:48 AM IST

Craze Combinations: ఎప్పటినుంచో ఎదురుచూస్తోన్న కొన్ని హీరో – డైరెక్టర్ క్రేజీ కాంబినేషన్స్.. అతిత్వరలో సెట్స్ పైకెళ్లబోతున్నాయి. సినిమా ప్రకటించాక కొవిడ్ బ్రేక్ కారణంగా అప్పటికే చేస్తున్న సినిమాలు లేటవడంతో ఇప్పటికి కొత్త ముహూర్తం పెట్టుకుంటున్నారు వీళ్లు. త్వరలో కలిసొస్తామంటూ ఇప్పటి నుంచే ఇండస్ట్రీని హీటెక్కిస్తున్న ఆ హాట్ హాట్ కాంబోస్ పై లెట్స్ హావ్ ఎ లుక్.

Crazy Combinations: లాంగ్ గ్యాప్ తర్వాత గ్యాప్ లేకుండా క్రేజీ కాంబినేషన్స్!

నెల గ్యాప్ తో ఆర్ఆర్ఆర్, ఆచార్య.. భారీ మల్టీస్టారర్ సినిమాలు చూపించబోతున్న రామ్ చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఫుల్ గా కాన్సట్రేట్ చేస్తున్నారు. ఆ రెండు సినిమాల తర్వాత పెద్ద గ్యాప్ తీసుకోకుండా దిల్ రాజు బ్యానర్ లో శంకర్ సినిమాను పట్టాలెక్కించారు మెగాపవర్ స్టార్. ఇప్పుడీ సినిమా లైన్ లో ఉండగానే గౌతమ్ తిన్ననూరి సినిమా కోసం పనులు షురూ చేశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రానున్న గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ జులై నెలలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Crazy Combinations: మళ్లీ మళ్లీ మేమే.. కాంబినేషన్స్ తో బ్యాక్ టు బ్యాక్ రచ్చ!

ట్రిపుల్ ఆర్ హీరోల్లో రామ్ చరణ్ వరుస సినిమాలను లైన్ లో పెడతూ జోష్ చూపిస్తున్నారు కానీ ఈ విషయంలో తారక్ కాస్త వెనుకబడ్డారు. ఆచార్య కారణంగా కొరటాల శివ ప్రాజెక్ట్ లేటయింది. తారక్ ఆర్ఆర్ఆర్, కొరటాల ఆచార్య రెండూ రిలీజ్ అయిపోతే ఇద్దరూ కలిసి సెట్స్ పైకెళ్తారు. దానికోసం మంచి ముహూర్తం కూడా చూస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత మరో స్టైలిష్ మాస్ మసాలా సినిమాను రెడీ చేస్తున్నారు ఎన్టీఆర్ – కొరటాల.

Crazy Combinations: బ్లాక్ బస్టర్ కాంబినేషన్స్.. ఈసారి అంతకు మించి!

అతిత్వరలో సెట్స్ పైకెళ్లబోతున్నారు మహేశ్ – త్రివిక్రమ్. అతడు, ఖలేజా తర్వాత కలిసొస్తున్న కాంబో ఇది. త్రివిక్రమ్ పంచ్ డైలాగ్ లకు, మహేశ్ టైమింగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ ఇస్తారు ఫ్యాన్స్. అయితే ఈసారి డోస్ డబుల్ చేసి పాన్ ఇండియా సినిమాతో వీళ్లిద్దరూ రాబోతున్నట్టు తెలుస్తోంది. సర్కారు వారి పాటను మార్చ్ 27కు పూర్తి చేసి.. ఎక్కువ ల్యాగ్ ఇవ్వకుండా త్రివిక్రమ్ తో వర్క్ చేయాలనేది మహేశ్ ప్లాన్.

Crazy Combinations: కలిసొచ్చిన హీరోలతో సక్సెస్ కొట్టిన డైరెక్టర్స్

వినోదయ సిత్తం, విక్రమ్ వేదా రీమేక్స్ అంటున్నారు కానీ హరిహర వీరమల్లు పూర్తిచేసాక హరీశ్ శంకర్ కాంబోలోనే పవన్ సినిమా ఉంటుందనే బజ్ నడుస్తోంది. గబ్బర్ సింగ్ లో పోలీసాఫీసర్ గా పవర్ స్టార్ ను ప్రెజెంట్ చేసిన హరీశ్ శంకర్ భవధీయుడు – భగత్ సింగ్ లో లెక్చరర్ గా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తయ్యాక.. అంతా అనుకున్నట్టు జరిగితే హరీశ్ శంకర్ సినిమా లేదంటే ఏదైనా రీమేక్ సినిమా స్టార్ట్ కావొచ్చు.

Virata Parvam: తండ్రీ కొడుకుల రిలీజ్ వార్.. ఫైనల్ గా ఓటీటీలోనే?!

గ్యాప్ లేకుండా కుమ్మేయబోతున్నారు పూరీ – విజయ్ దేవరకొండ. లైగర్ తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్ చేసారు. వీళ్ల కాంబినేషన్ లో జనగణమన రెగ్యులర్ షూటింగ్ ను వచ్చే నెల ఏప్రిల్ నుంచే స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆఫ్రికాలో లోకేషన్ సెర్చింగ్ లో ఉన్నా టీమ్ ప్రీప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేస్తుంది. హీరోయిన్ గా జాన్వీకపూర్ అంటున్నారు కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

Web Series Telugu: ఓటీటీని దోచుకొనే పనిలో పడిన టాప్ డైరెక్టర్లు.. బడా ప్రొడ్యూసర్లు!

కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీకి ముహూర్తం ఖరారైనట్టు చెప్తున్నారు. వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబినేషన్ లో విజయ్ నటించబోతున్న సినిమా ఈ ఉగాదికే ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్ గా రష్మికా, మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ కూడా ఫిక్సయినట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి.