క్రేజీ కాంబినేషన్స్..

Romours: యాక్షన్ డైరెక్టర్ బోయపాటితో తమిళ్ స్టార్ హీరో సూర్య, రామ్ చరణ్-యష్ కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్ట్, బాలయ్య బాబు, గోపీచంద్ కలిసి ఇంకో సినిమా.. ఈ క్రేజీ కాంబినేషన్ రూమర్స్ ఎంత వర్కవుట్ అవుతాయో ఏంటో డీటెయిల్డ్ గా చూద్దాం.
యష్, చరణ్-శంకర్
టాలీవుడ్‌లో ఇంతకు ముందెప్పుడూ లేని కొత్త కొత్త కాంబినేషన్స్ తెరమీదకొస్తున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్స్ మీద రూమర్స్ వినిపిస్తున్నాయి. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, కన్నడ రాకింగ్ స్టార్ యష్ కలిసి సినిమా ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్‌లో రూమర్ బాగా నడుస్తోంది. యష్ ఎప్పటినుంచో డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ చెయ్యాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఇక రామ్ చరణ్ కూడా రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా పాన్ ఇండియా రేంజ్ కోసం యష్‌తో సినిమాకి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారని, ఈ డ్యుయోకి భారీ బడ్జెట్ మూవీస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించనున్నారని.. హిస్టారికల్ వార్ డ్రామా రూపొందబోయే ఈ సినిమా షూటింగ్‌కే నాలుగు సంవత్సరాల సమయం పడుతుందని సినిమాని ఓ రేంజ్‌కి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారని అటు కోలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో గాసిప్స్ వినిబడుతున్నాయి.
సూర్య-బోయపాటి
యాక్షన్‌తో జనానికి ఊపు తెప్పించే ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. ఈ మధ్య గ్యాప్ వచ్చినా కూడా తన మాస్ క్రేజ్‌ని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ గాసిప్‌తో సడెన్‌గా హాట్ టాపిక్ అయ్యారు. ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాతో మరోసారి తన ఏస్ యాక్టింగ్‌ని చూపించిన వర్సెటైల్ తమిళ్ స్టార్ సూర్యతో బోయపాటి సినిమా చేస్తున్నారని ఇండస్ట్రీలో గాసిప్ సూపర్ స్పీడ్‌గా స్ప్రెడ్ అవుతోంది. తెలుగులో సినిమా చేస్తానని చెబుతున్న సూర్యకి, తన మాస్ సబ్జెక్ట్‌తో తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఉంటుందని, అందుకే ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుందని టాక్ నడుస్తోంది.
బాలయ్య-గోపిచంద్
టాలీవుడ్‌లో హాట్ హాట్‌గా వినిపిస్తున్న మరో గాసిప్ గోపీచంద్-బాలయ్య కాంబినేషన్. ‘క్రాక్’ సినిమాతో లేటెస్ట్‌గా సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ మలినేని గోపీచంద్, మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌తో ఇంకా సోలోగా ఆడియన్స్‌ని అదరగొడుతున్న బాలకృష్ణ కాంబినేషన్‌లో త్వరలో సినిమా తెరకెక్కబోతోందని రూమర్ వినిపిస్తోంది. హీరోని బాగా ఎలివేట్ చేసే గోపీచంద్ పనికి ఇంప్రెస్ అయిన బాలయ్య.. మలినేని గోపీచంద్‌తో నెక్ట్స్ సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యారని టాక్. మరి టాలీవుడ్‌లో నడుస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్స్ మీద వస్తున్న రూమర్స్ నిజమైతే.. ఆడియన్స్‌కి డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ గ్యారంటీ.