Director Maruthi : 100 ఏళ్ళ బార్బర్.. నా చిన్నప్పుడు ఇక్కడే కటింగ్ చేయించుకున్నా.. డైరెక్టర్ మారుతి ఎమోషనల్ పోస్ట్..

తాను చిన్నప్పుడు కటింగ్ చేయించుకున్న బార్బర్ ఫోటోని షేర్ చేశారు దర్శకుడు మారుతి. తన ఊరు మచిలీపట్నం వెళ్లగా అక్కడ ఆ బార్బర్ తో సెల్ఫీ దిగి ఆ ఫోటో, ఆ బార్బర్ ఫోటోని తన ట్విట్టర్ లో షేర్ చేశారు.

Director Maruthi : 100 ఏళ్ళ బార్బర్.. నా చిన్నప్పుడు ఇక్కడే కటింగ్ చేయించుకున్నా.. డైరెక్టర్ మారుతి ఎమోషనల్ పోస్ట్..

Director MaruthI Shares his childhood Barber photo and post emotionally

Updated On : April 12, 2023 / 10:46 PM IST

Director Maruthi :  పలువురు సెలబ్రిటీలు అప్పుడప్పుడు తమ చిన్ననాటి జ్ఞాపకాలను సోషల్ మీడియాలో(Social Media) షేర్ చేసుకుంటూ ఉంటారు. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతారు. తాజాగా దర్శకుడు మారుతి (Director Maruthi) తన చిన్నప్పటి ఓ జ్ఞాపకాన్ని షేర్ చేసుకున్నాడు. డిఫరెంట్ జోనర్స్ లో కామెడీ సినిమాలకు(Comedy Movies) కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన డైరెక్టర్ మారుతి ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) తో ఓ సినిమా చేస్తున్నాడు.

తాజాగా మారుతి తన ఊర్లో తాను చిన్నప్పుడు కటింగ్ చేయించుకున్న బార్బర్ ఫోటోని షేర్ చేశారు. మారుతి తన ఊరు మచిలీపట్నం వెళ్లగా అక్కడ ఆ బార్బర్ తో సెల్ఫీ దిగి ఆ ఫోటో, ఆ బార్బర్ ఫోటోని తన ట్విట్టర్ లో షేర్ చేసి.. ఈయన పేరు సీతారామారావు. 100 ఏళ్ళ బార్బర్ మా ఊళ్ళో. మా తాతయ్యకు, మా నాన్నకు, నాకు కూడా కటింగ్ చేశారు. నా చిన్నప్పుడు ఈయన దగ్గరే కటింగ్ చేయించుకున్నాను. ఈయన నా చిన్నప్పటి జ్ఞాపకం. ఈయన 100 ఏళ్ళు వచ్చినా ఇప్పటికి వర్క్ చేస్తున్నారు. ఈయన మరింత ఎక్కువ కాలం బతకాలి అని పోస్ట్ చేశారు.

Narendra Modi : ఎలిఫెంట్ విష్పరర్స్ ఏనుగులతో మోదీ.. అందులో నటించిన మావటీలకు ప్రధాని ప్రత్యేక అభినందనలు..

Image
దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. 100 ఏళ్ళు వచ్చినా ఇంకా వర్క్ చేస్తున్నారు అనడంతో ఆ బార్బర్ సీతారామారావు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్స్ చేస్తున్నారు. పెద్దాయనకు ఓపిక్కి దండాలు పెడుతున్నారు.