Nani : నేను నిన్ను నమ్ముతున్నాను.. నువ్వు నన్ను నమ్ము.. ఎవరి కోసం నాని ఈ మాటలు..!
నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు నన్ను నమ్ము అంటున్న నాని. ఎవరి కోసం ఈ మాటలు..

Tollywood hero Nani viral tweet on Hi nanna promotions
Nani : నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘హాయ్ నాన్న’ సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో నాని బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా నాని ఒక ఆసక్తికర పోస్ట్ వేశాడు. “నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు నన్ను నమ్ము. ఆ తరువాత అంతా మ్యాజిక్‌గా ఉంటుంది” అంటూ ట్వీట్ చేశాడు. ఇంతకీ నాని ఈ మాటలు ఎవరికోసం చెప్పాడు..?
హాయ్ నాన్న సినిమా టీజర్ గురించి అప్డేట్ ఇస్తూ నాని ఈ కామెంట్స్ చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మృణాల్ తో తను ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. నాని ఈ కామెంట్స్ చేశాడు. ఇక టీజర్ ని ఈ ఆదివారం (అక్టోబర్ 15) ఉదయం గం.11:00 రిలీజ్ చేయబోతున్నట్లు తెలియజేశాడు. కాగా ఈ మూవీని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 21న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. అయితే ఈ సినిమా పోస్టుపోన్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి.
Also read : Saindhav : వెంకీ మామ యాక్షన్‌కి టీజర్ రెడీ అయ్యింది.. ఎటాక్‌కి టైం ఫిక్స్..
I trust you
You trust me …Will be magic ♥️#HiNanna Teaser on 15th 🙂 pic.twitter.com/nki2a0ib4O
— Nani (@NameisNani) October 12, 2023
ఈ టీజర్ తో ఆ రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ వస్తుందేమో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి మూవీ టీం విడుదల తేదీ పై ఎలాంటి సమాచారం ఇస్తారో చూడాలి. కాగా ఈ సినిమాని కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో శృతిహాసన్ కూడా ఒక ముఖ్య పాత్ర చేస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు సాంగ్స్ ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. హేశం అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.