Tollywood : ముగిసిన నిర్మాత మండలి సమావేశం.. వచ్చే నెల ఎన్నికలు జరిగే అవకాశం..

టాలీవుడ్ సినీపరిశ్రమలో నేడు నిర్మాతల మండలి కార్యవర్గ సమావేశం జరిగింది. పదవీ కాలం ముగిసినా నిర్మాతల మండలి ఎన్నికలు నిర్వహించడం లేదని.. మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ పై సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సుదీర్ఘ చర్చలు జరిపి ఒక నిర్ణయాన్ని వచ్చింది నిర్మాత మండలి. వచ్చే నెల ఎన్నికలు నిర్వహించడానికి అధ్యక్షుడు సి.కళ్యాణ్ పచ్చ జెండా ఊపేసాడని తెలుస్తుంది.

Tollywood : ముగిసిన నిర్మాత మండలి సమావేశం.. వచ్చే నెల ఎన్నికలు జరిగే అవకాశం..

tollywood producers council elections are may held in february

Updated On : January 4, 2023 / 4:59 PM IST

Tollywood : టాలీవుడ్ సినీపరిశ్రమలో నేడు నిర్మాతల మండలి కార్యవర్గ సమావేశం జరిగింది. పదవీ కాలం ముగిసినా నిర్మాతల మండలి ఎన్నికలు నిర్వహించడం లేదని.. మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ పై సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరగా ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు చిన్న నిర్మాతలు. దీంతో సి.కళ్యాణ్‌, నిర్మాతల మండలి సభ్యులు మధ్య కొంత వాగ్వాదం జరిగింది.

Tollywood : సి.కళ్యాణ్‌పై నిర్మాతల మండలి సభ్యుల ఆగ్రహం..

ఈ క్రమంలో.. మీరొక పనికిరాని ప్రెసిడెంట్ అంటూ సభ్యులు, నువ్వొక పనికిరాని మెంబర్ అంటూ ప్రెసిడెంట్ ఒకరిని ఒకరు దూషించుకున్నారు. అయితే కొద్దిసేపటికి ఈ గొడవ సద్దుమణగడంతో మళ్ళీ చర్చలు జరిపి ఒక నిర్ణయాన్ని వచ్చింది నిర్మాత మండలి. వచ్చే నెల ఎన్నికలు నిర్వహించడానికి అధ్యక్షుడు సి.కళ్యాణ్ పచ్చ జెండా ఊపేసాడని తెలుస్తుంది.

కార్యవర్గ సమావేశంలో ఫిబ్రవరి 26న ఎన్నికలు జరపాలనే ఆలోచన చేశారట. ఈ డేట్‌పై క్లారిటీ రాగానే అధికారికంగా ఎన్నికల తేదీని ప్రకటించనున్నారు అధ్యక్షుడు సి.కళ్యాణ్. కాగా ఈ ఎన్నికలు రెండేళ్లకి ఒకసారి జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా గత 5 ఏళ్లగా ఈ ఎన్నికలు బ్రేక్ పడింది.