Vidyasagar Raju : టాలీవుడ్ లో విషాదం.. సీనియర్‌ నటుడు, రచయిత విద్యాసాగర్‌ రాజు కన్నుమూత..

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్‌ నటుడు, రచయిత విద్యాసాగర్‌ రాజు (72) కన్నుమూశారు. రంగస్థల నటుడిగా కెరీర్ ని మొదలుపెట్టి, ఆ తర్వాత వెండితెరపైకి అడుగుపెట్టి హీరోగా, విలన్ గా............

Vidyasagar Raju : టాలీవుడ్ లో విషాదం.. సీనియర్‌ నటుడు, రచయిత విద్యాసాగర్‌ రాజు కన్నుమూత..

Tollywood senior artist vidyasagar passes away

Updated On : August 29, 2022 / 7:17 AM IST

Vidyasagar Raju :  టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్‌ నటుడు, రచయిత విద్యాసాగర్‌ రాజు (72) కన్నుమూశారు. రంగస్థల నటుడిగా కెరీర్ ని మొదలుపెట్టి, ఆ తర్వాత వెండితెరపైకి అడుగుపెట్టి హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో మెప్పించారు. ఈ చదువులు మాకొద్దు, అంకురం, రాజేంద్రుడు గజేంద్రుడు, ఆఖరి క్షణం, మాయలోడు, స్వాతిముత్యం, అహనా పెళ్ళంట.. లాంటి దాదాపు 100కి పైగా సినిమాల్లో నటించారు.

KGF Actor Harish Rai : కేజీయఫ్ నటుడికి క్యాన్సర్.. డబ్బుల్లేక.. ఆదుకునేవాళ్లే లేరా..?

సినిమాల్లోనే కాక కొన్ని సీరియల్స్ లో కూడా నటించి మెప్పించారు. అలాగే పలు సినిమాలకి రచయితగా కూడా పని చేశారు. ఈయన భార్య రత్నాసాగర్‌ కూడా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. కొన్నేళ్ల క్రితం ఈయన పక్షవాతానికి గురయ్యారు. అప్పట్నుంచి సినిమాలకి, సీరియల్స్ కి దూరంగా ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం ఆయన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు.