Mahesh Babu : మహేష్ బాబు మరీ ఇంత ఇంట్రోవర్టా..? ఏంటి బాబు ఇది.. అందరూ ఎంజాయ్ చేస్తుంటే..
మహేష్ బాబు ఇంట్రోవర్ట్ అయినా పంచులు బాగానే వేస్తాడు. కామెడీ టైమింగ్ తో అదరగొడతాడు.

Tollywood Stars Enjoying in Birthday Party but Mahesh Babu takes Space video goes Viral
Mahesh Babu : మన సెలబ్రిటీలతో ప్రభాస్, మహేష్, పవన్ లాంటి కొంతమంది ఇంట్రోవర్ట్స్ కూడా ఉన్నారు. కానీ సమయం దొరికితే మాత్రం బాగానే పంచులు వేస్తారు, మాట్లాడతారు. నలుగురిలో ఉంటే మాత్రం సింపుల్ గా, సైలెంట్ గా ఉంటారు. పవన్ రాజకీయాల్లోకి వచ్చాక ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రావర్ట్ గా మారారు. అయితే మహేష్ బాబు ఇంట్రోవర్ట్ అయినా పంచులు బాగానే వేస్తాడు. కామెడీ టైమింగ్ తో అదరగొడతాడు.
తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది. ఇటీవల చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్, అఖిల్, వెంకటేష్, మహేష్.. ఇలా స్టార్స్ అంతా కలిసి మాల్దీవ్స్ లో ఓ బిజినెస్ మెన్ పుట్టిన రోజు వేడుకలు వెళ్లారు. ఇప్పటికే ఈ వేడుకల నుంచి పలు ఫొటోలు, వీడియోలు బయటకి వచ్చాయి. వాటిల్లోంచి ఓ చిన్న వీడియో వైరల్ అవుతుంది.
Also Read : Sujeeth – Varun Tej : పవన్ OG కంటే ముందు వరుణ్ తేజ్ తో సినిమా ప్లాన్ చేసిన సుజీత్.. ఆ సినిమా ఏమైంది..?
ఈ వీడియోలో చిరు, నాగ్, వెంకటేష్ అందరూ బర్త్ డే బాయ్ తో ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటే మహేష్ పక్కనే కొంచెం గ్యాప్ తో నిల్చున్నాడు. అందరూ ఎంజాయ్ చేస్తుంటే మహేష్ మాత్రం అలా నిల్చొని ఫోటోకి పోజ్ ఇచ్చినట్టు ఇచ్చి పక్కకు వచ్చేసాడు. దీంతో ఈ వీడియో వైరల్ అవ్వగా మహేష్ బాబు ఏంటి వాళ్ళతో కలవకుండా పక్కన నిల్చున్నాడు, మహేష్ మరీ ఇంత ఇంట్రోవర్టా, వాళ్ళ లాగా ఎంజాయ్ చెయ్యట్లేదు ఏంటి అని ఫ్యాన్స్, నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా మహేష్ వీడియో చూసేయండి..
Clueless me in family functions 😭 : pic.twitter.com/0jxDW2YoYX
— ₹evanth Palwai (@revanth47) November 13, 2024