Sujeeth – Varun Tej : పవన్ OG కంటే ముందు వరుణ్ తేజ్ తో సినిమా ప్లాన్ చేసిన సుజీత్.. ఆ సినిమా ఏమైంది..?
సుజీత్ పవన్ కళ్యాణ్ OG కంటే ముందు వరుణ్ తేజ్ తో ఒక సినిమా ప్లాన్ చేసాడట.

Pawan Kalyan OG Movie Director Sujeeth Planned a Movie with Varun Tej before OG
Sujeeth – Varun Tej : సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న OG సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ తోనే ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాడు. పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ పవన్ రాజకీయాల బిజీ వల్ల ఈ సినిమా లేట్ అవుతుందని తెలిసిందే.
అయితే సుజీత్ పవన్ కళ్యాణ్ OG కంటే ముందు వరుణ్ తేజ్ తో ఒక సినిమా ప్లాన్ చేసాడట. వరుణ్ తేజ్ మట్కా సినిమా నవంబర్ 14న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన మీమర్స్ మీట్ లో వరుణ్ తేజ్ సుజీత్ సినిమా గురించి మాట్లాడాడు.
Also Read : Ashu Reddy : బామ్మగా మారిన హాట్ భామ అషు రెడ్డి.. ఫోటోలు చూశారా? ఎందుకు ఇలా మారింది?
వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ OG కంటే ముందు సుజీత్ తో ఒక సినిమా అనుకున్నాము. నాకు కథ చెప్పాడు. కథ కూడా నచ్చింది. మేమిద్దరం కలిసి ఆ సినిమా చేద్దాం అనుకున్నాము. కానీ నా కమిట్మెంట్స్ వల్ల అది వెంటనే వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత సుజీత్ OG తో బిజీ అయ్యాడు. భవిష్యత్తులో మేమిద్దరం కలిసి సినిమా చెయ్యొచ్చు అని అన్నాడు. మరి పవన్ సినిమా తర్వాత సుజీత్ వరుణ్ తోనే చేస్తాడేమో చూడాలి.
అయితే గతంలోనే సుజీత్ – వరుణ్ తేజ్ కాంబోలో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. వరుణ్ తేజ్ తాజాగా మట్కా ప్రమోషన్స్ లో ఈ విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చాడు.