Summer 2023: సమ్మర్ మొన్నే అయింది.. వచ్చే సమ్మర్ ని కూడా టార్గెట్ చేసేశారు..

ఈ సంవత్సరం సమ్మర్ లో పోటా పోటీగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందుకే సినిమాలకు బెస్ట్ సీజన్ అయిన సమ్మర్ నే టార్గెట్ చేసుకున్నారు స్టార్ హీరోలు. సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా వరస పెట్టి సమ్మర్ లో.........

Summer 2023: సమ్మర్ మొన్నే అయింది.. వచ్చే సమ్మర్ ని కూడా టార్గెట్ చేసేశారు..

Summer Movies

Updated On : July 14, 2022 / 2:59 PM IST

Tollywood :  మొన్నే సమ్మర్ అయిపొయింది. ఎప్పట్నుంచో కరోనా వల్ల వాయిదా పడిన సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవ్వడంతో ఈ సమ్మర్ మంచి ఎంతెర్తైనింగ్ గానే గడిచింది. చాలానే సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇలా సమ్మర్ అయిపోయి వర్షాలు మొదలయ్యాయి లేదో టాలీవుడ్ అప్పుడే వచ్చే సమ్మర్ ని టార్గెట్ చేసేసింది. ఒకరిద్దరు కాదు వరసగా టాలీవుడ్ లోఉన్న స్టార్ హీరోలందరూ వేసవి బరిలోకే దిగడానికి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్, మహేష్, చిరంజీవి.. ఇలా స్టార్ హీరోలంతా సమ్మర్ హీట్ ని పెంచడానికి రెడీ అవుతున్నారు.

ఈ సంవత్సరం సమ్మర్ లో పోటా పోటీగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందుకే సినిమాలకు బెస్ట్ సీజన్ అయిన సమ్మర్ నే టార్గెట్ చేసుకున్నారు స్టార్ హీరోలు. సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా వరస పెట్టి సమ్మర్ లో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. నెక్ట్స్ ఇయర్ సమ్మర్ లో దాదాపు ఫస్ట్ రిలీజ్ అయ్యే సినిమా రామ్ చరణ్ దే. శంకర్ – రామ్ చరణ్ కాంబినేషన్లో పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2023 ఎర్లీ సమ్మర్ మార్చిలో రిలీజ్ కి రెడీ అవుతోంది. అనుకున్న టైమ్ కన్నా సినిమా ముందే రెడీ అవుతుండడంతో మిడ్ సమ్మర్ మూవీ కాస్తా మార్చికే ప్రీ పోన్ అయ్యేలా ఉంది.

Rashmika Mandanna : ఆ రెండూ రోజులు.. రష్మిక ముంబైలో ఏం చేసి వచ్చింది??

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ సలార్ కూడా సమ్మర్ కే రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించారు. ఇప్పటికే 60 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ చేసిన ప్రశాంత్ నీల్ ఏప్రిల్ లో సినిమా రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేసుకనే పనిలో ఉన్నారు. మహేష్ బాబు కూడా తన సమ్మర్ సెంటిమెంట్ ని రిపీట్ చేద్దామనే చూస్తున్నారు. ఇటీవల సమ్మర్ లో సర్కారు వారి పాట సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టారు. ఇప్పుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా త్వరలో సెట్స్ మీదకెళ్లబోతున్న సినిమాని వచ్చే మే లోనే రిలీజ్ చెయ్యడానికి ఫిక్సయ్యారు. పూజాహెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ మార్క్ కామెడీ విత్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ప్లాన్ చేసిన ఈ సినిమా ఆగస్టులో షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది.

దసరాకి గాడ్ ఫాదర్, సంక్రాంతికి వాల్తేరు వీరయ్యని అనౌన్స్ చేసిన మెగాస్టార్ సమ్మర్ కి మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు. మెహర్ రమేష్ డైరెక్షన్లో చిరంజీవి హీరోగా, తమన్నా హీరోయిన్ గా తెరకెక్కుతున్న మాస్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ భోళాశంకర్ సినిమాని సమ్మర్ కే రిలీజ్ చేయాలని చేస్తున్నారు చిరు. సౌత్ లోనే కాకుండా ఇండియా మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తున్న పుష్ప 2 మూవీ సమ్మర్ నే టార్గెట్ చేసుకుంది. షూటింగ్ స్టార్ట్ చెయ్యడం లేట్ అవుతుండటంతో రిలీజ్ సమ్మర్ కి ప్లాన్ చేశారు చిత్ర యూనిట్. సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ, రష్మిక జంటగా వచ్చిన మహిత్ సినిమా పుష్ప కి పార్ట్ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సూపర్ క్రేజీ మూవీని కూడా సమ్మర్ కే రిలీజ్ చేయబోతున్నారు.

New Movies : సాఫ్ట్ టైటిల్స్‌తో వస్తున్న యువ హీరోలు..

చరణ్ తో కలిసి ఈ సమ్మర్ లో ట్రిపుల్ఆర్ హిట్ కొట్టిన తారక్ వచ్చే సమ్మర్ కి కొరటాల శివతో చేసే సినిమాని రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. ఇంకా షూటింగ్ మొదలవ్వకపోయినా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీన్ని కూడా సమ్మర్ కె ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ ఈనెలలో రామారావ్ ఆన్ డ్యూటీ , దసరాకి రావణాసుర సినిమాల్ని ప్లాన్ చేశాడు. నక్కిన త్రినాధ్ రావ్ డైరెక్షన్లో మాస్ మహారాజా చేస్తున్న ధమాకా సినిమాని 2023 సమ్మర్ లోనే రిలీజ్ కి ప్లాన్ చేయబోతున్నారు. ఇలా స్టార్ హీరోలంతా వచ్చే సమ్మర్ కి టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ఆ సమయానికి ఇంకా కొన్ని సినిమాలు జత చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు.