ET20 : యానిమ‌ల్‌కు ఏ స‌ర్టిఫికేట్‌.. సీనియర్ నటుడు నరేశ్‌కి అరుదైన గౌరవం

Entertainment 20 : టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు సినిమా క‌బుర్లు మీకోసం

ET20 : యానిమ‌ల్‌కు ఏ స‌ర్టిఫికేట్‌.. సీనియర్ నటుడు నరేశ్‌కి అరుదైన గౌరవం

Entertainment 20

Updated On : November 26, 2023 / 8:09 PM IST

న‌టి వనిత విజ‌య్‌కుమార్ పై దాడి..
తమిళ నటి వనిత విజయ్ కుమార్‌పై దాడి జరిగింది. తమిళ బిగ్‌బాస్‌ హౌస్‌లో కొద్ది రోజులుగా ఆమె కూతురు జోవిక, ప్రదీప్ ఫ్యాన్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తాజాగా ఈ షో పై రివ్యూలు చేస్తున్న తనపై ప్రదీప్ అభిమానులు దాడికి పాల్పడ్డారని ట్వీట్ చేసింది. నా మీద దాడిని ధైర్యంగా పోస్ట్ చేస్తున్నా అంటూ తెలిపింది. దాడి చేయడం సరైన పద్ధతి కాదని తెలిపింది.

 

View this post on Instagram

 

A post shared by Vanitha Vijaykumar (@vanithavijaykumar)

అలాంటి ల‌క్ష‌ణాలు ఉన్న భ‌ర్త కావాలంటున్న శ్రీలీల..
తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో స్టార్ హీరోయిన్‌ శ్రీలీల తెలిపారు. తనను కట్టుకోబోయేవాడు అందంగా ఉండి.. కుటుంబానికి విలువ ఇవ్వాలని తెలిపారు. దీంతో పాటు అతడికి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలంది. కొన్ని కొన్ని తనను భరించడం కష్టమని.. ఆ కష్టాన్ని ఇష్టంగా భావించాలని తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ఈ లక్షణాలు ఉన్నవాడినే పెళ్లి చేసుకుంటా అని తెలిపింది.

ఫ్యాన్ పేజీలపై అసహనం..
నటి పరిణీతి చోప్రా.. తన ఫ్యాన్ పేజీలపై అసహనం వ్యక్తం చేశారు. సోషల్‌మీడియా వేదికగా తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న పేజీలకు వార్నింగ్ ఇచ్చారు. తమ అభిమాన నటులను ప్రశంసించుకోవడానికి తన పేరును ఉపయోగించుకుంటున్నారని సీరియస్ అయ్యారు. ఆ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని.. తాను ఏ ఒక్కరినీ ప్రశంసించడానికి ఎలాంటి ఇంటర్వ్యూలూ ఇవ్వలేదన్నారు.

ఏ స‌ర్టిఫికేట్‌పై క్లారిటీ..
బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌, అందాల భామ రష్మిక నటించిన సినిమా యానిమల్. ఈ సినిమా రన్‌టైమ్‌, సెన్సార్ సర్టిఫికెట్‌పై డైరెక్టర్ సందీప్ వంగా క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డ్‌ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. పిల్లలు కోసం రాజీపడితే సన్నివేశాల్లో గాఢత తగ్గిపోతుందన్నారు. అది సినిమాకు మైనస్ అయినా.. వెనక్కి తగ్గలేదన్నారు. నిడివి విషయం సినిమా చూసే సమయంలో పెద్ద సమస్య కాదన్నారు.

తన తదుపరి చిత్రం ‘యానిమల్’ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు నటి రష్మిక. దీనికి సంబంధించిన ఫొటోలు షేర్‌ చేసి కౌంట్‌డౌన్‌ మొదలుపెట్టండి.. మరో ఆరు రోజుల్లో ‘యానిమల్‌’ విడుదల అంటూ పోస్ట్‌ పెట్టారు.

మాల్దీవుల్లో హీరో కార్తీకేయ..
తీసింది కొద్దీ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు హీరో కార్తీకేయ. ఆయన వివాహ వార్షికోత్సవం సందర్భంగా.. సతీమణి లోహితతో మాల్దీవులకు వెళ్లారు. అక్కడ బీచ్‌లో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Lohitha Reddy (@loh_reddy)

ఆరెంజ్‌ కలర్ దుస్తుల్లో శ్ర‌ద్ధాదాస్‌..
నటి శ్రద్ధా దాస్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తున్న ఈ బ్యూటీ.. ఫొటో షూట్‌లతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు పలకరిస్తోంది. తాజాగా ఓ ఫొటో షూట్‌లో పాల్గొంది. ఇందులో ఆరెంజ్‌ కలర్‌ డ్రెస్‌ ధరించి హొయలొలికించారు. ఆ చిత్రాలను ఇన్‌ స్టా వేదికగా పంచుకున్నారు.

అరుదైన గౌరవం..
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్‌ విజయకృష్ణకి అరుదైన గౌరవం లభించింది. ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో జరిగిన 5వ ప్రపంచ కాంగ్రెస్‌ సమావేశాల్లో ఆయనకి సర్‌ అనే బిరుదుతోపాటు డాక్టరేట్‌ని ప్రదానం చేశారు. నరేశ్‌ను మిలటరీ ఆర్ట్స్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా, లెఫ్టినెంట్‌ కల్నల్‌గా నియమించినట్టు ఆయన సన్నిహితులు ఓ ప్రకటనలో తెలిపారు.

25 రోజులైనా..
సత్యం రాజేశ్ లీడ్ రోల్‌లో నటించిన హార్రర్ థ్రిల్లర్‌ మూవీ “మా ఊరి పొలిమేర-2”. ఈ మూవీ రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. విడుదలై 25 రోజులైన మంచి వసూళ్లు రాబడుతోంది. ఈమూవీలో గెటప్‌ శ్రీను, బాలాదిత్య, చిత్రం శ్రీను తదితరులు నటించారు.

మహేంద్రగిరి వారాహి ఫ‌స్ట్‌లుక్ అప్డేట్‌..
సుమంత్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం “మహేంద్రగిరి వారాహి”. ఈ సినిమాని జాగర్లమూడి సంతోష్ తెరకెక్కిస్తున్నారు. మీనాక్షీ గోసామి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రేపు హీరో విశ్వక్‌ సేన్ విడుదల చేయనున్నారు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా రూపొందించినట్లు మూవీ టీమ్‌ ప్రకటించింది.

హరోంహర ఫ‌స్ట్‌లుక్‌..
సుధీర్ బాబు తాజా చిత్రం హరోంహర. ‘ది రివోల్ట్‌’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా నుంచి విల‌న్ పాత్రలు పోషిస్తున్న ఫ‌స్ట్ లుక్‌ల‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. క‌న్నడ న‌టుడు ర‌వి కాలే ఈ సినిమాలో బ‌స‌వ రెడ్డి న‌టించ‌బోతుండ‌గా.. కేజీఎఫ్ ఫేమ్ ల‌క్కీ ల‌క్ష్మణ్ తమ్మి రెడ్డిగా, అర్జున్ గోవిందా.. శ‌ర‌త్ రెడ్డి పాత్రలో న‌టించ‌నున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకు జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు.

హరోంహర టీజ‌ర్‌కి టైమ్ ఫిక్స్‌..
హరోంహర నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది చిత్రయూనిట్‌. ఈ సినిమా టీజ‌ర్‌ను రేపు 2మేకర్స్‌ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.ఈ మూవీ టీజ‌ర్‌ను మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాంఛ్ చేయ‌బోతున్నారు. ఈ మూవీలో ర‌వి కాలే, కేజీఎఫ్ ఫేమ్ ల‌క్కీ ల‌క్ష్మణ్, అర్జున్ గోవిందా కీల‌క పాత్రల్లో క‌నిపించ‌నున్నారు.

హరోంహర నుంచి మలయాళి టీజర్‌ను.. నటుడు మమ్ముట్టి విడుదల చేయనున్నారు.ఈ సినిమా టీజ‌ర్‌ను రేపు మమ్ముట్టి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.ఈ మూవీ టీజ‌ర్‌ను మధ్యాహ్నం 2 గంటల 30 మలయాళి భాషలో లాంఛ్ చేయ‌బోతున్నారు. ఈ మూవీలో ర‌వి కాలే, కేజీఎఫ్ ఫేమ్ ల‌క్కీ ల‌క్ష్మణ్, అర్జున్ గోవిందా కీల‌క పాత్రల్లో క‌నిపించ‌నున్నారు.

మావోయిస్టుగా మనోజ్ బాజ్‌పేయి..
సర్వైవల్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు నటుడు మనోజ్ బాజ్‌పేయి. ఆయన తాజా చిత్రం జోరం. దేవాశిష్ మఖిజా దర్శకత్వం వ‌హించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా ప్రేక్షకుల వద్ద నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో మావోయిస్టుగా మనోజ్ బాజ్‌పేయి కనిపించనున్నారు.

ఓటీటీలోకి మిషన్ రాణిగంజ్..
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ చిత్రం ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ఆయ‌న తాజాగా న‌టించిన చిత్రం మిషన్ రాణిగంజ్. ది గ్రేట్ భారత్ రెస్క్యూ అనేది ఉప శీర్షిక. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదికా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. డిసెంబ‌ర్ 1 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది. టీను సురేష్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

47 ఏళ్ల వ‌య‌సులో పెళ్లిపీట‌లెక్క‌నున్న న‌టుడు..
బాలీవుడ్ నటుడు రణ్‌దీప్‌ హుడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. 47 ఏళ్ల వయసులో ఆయన పెళ్లి చేసుకోనున్నారు. తన ప్రియురాలు బాలీవుడ్ మోడల్ లిన్‌ లైస్రామ్‌ను పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో తెలుపుతూ పోస్ట్ పెట్టారు. ఈ నెల 29న ఇంఫాల్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితులు సమక్షంలో ఒక్కటి కానున్నారు.

డిసెంబ‌ర్ నుంచి మ‌ట్కా షూటింగ్..
మెగా హీరో వరుణ్ తేజ్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం మట్కా. ఈ సినిమాకు కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్‌ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

కేసీపీడీ పాట‌కు మంచి స్పంద‌న‌..
కార్తీక్‌రాజు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం అథర్వ. సిమ్రాన్‌ చౌదరి, ఐరా కథానాయికలు. మహేశ్‌రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సుభాష్‌ నూతలపాటి నిర్మాత. ఈ సినిమాలోని కేసీపీడీ… అంటూ సాగే పాటని ఇటీవల విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని చిత్రయూనిట్ తెలిపింది.

డాన్‌ 360 ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌..
భరత్‌ కృష్ణ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం డాన్‌ 360. ది గేమ్‌ ఈజ్‌ ఆన్‌ అనేది ఉపశీర్షిక. ప్రియా హెగ్డే కథానాయిక నటించింది. జె.ఎస్‌.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఉదయ్‌రాజ్‌ నిర్మించారు. ట్రైలర్ ఈవెంట్ లాంచ్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. యాక్షన్‌ ప్రధానంగా ఈ సినిమా సాగుతుందని మేకర్స్ తెలిపారు.

ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైల‌ర్ అప్‌డేట్‌..
నితిన్ నటించిన తాజా చిత్రం ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌. ఈ సినిమాకు సంబంధించి చిత్రయూనిట్ కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ను రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు.

స్టోర్ ఓపెనింగ్‌లో న‌మ్ర‌త సంద‌డి..
సూపర్ స్టార్‌ మహేశ్ బాబు భార్య నమ్రత శిరోద్కర్‌ ఓ స్టోర్ ఓపెనింగ్‌లో సందడి చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన రీనా మల్టీ డిజైనర్‌ షో రూమ్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా అందులో ఏర్పాటు చేసిన కొత్త డిజైన్‌లను పరిశీలించారు.

టిల్లు స్క్వేర్ నుంచి సెకండ్ సింగిల్‌..
సిద్దు జొన్నలగడ్డ.. అనుపమ పరమేశ్వర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా టిల్లు స్క్వేర్. ఈ సినిమా నుంచి సెక్ండ్ సింగిల్ ప్రోమో విడుదలైంది. పూర్తి సాంగ్‌ను రేపు సాయంత్రం విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 9 న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. టీజే టిల్లు గ్రాండ్‌ సక్సెస్‌తో జోరు మీదున్న టిల్లు స్క్వేర్‌తో మరో సక్సెస్‌ కోసం ఉవ్విళ్లూరుతున్నారు.