కరోనాపై పోరాటం: దర్శకుడు త్రివిక్రమ్ సాయం

  • Published By: vamsi ,Published On : March 26, 2020 / 06:19 AM IST
కరోనాపై పోరాటం: దర్శకుడు త్రివిక్రమ్ సాయం

Updated On : March 26, 2020 / 6:19 AM IST

కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అండగా.. సినిమా వాళ్లు కదలి వస్తున్నారు. ఒక్కొక్కరుగా ముఖ్యమంత్రి సహాయనిధికి డబ్బులు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షలు ఇస్తున్నారు త్రివిక్రమ్. 

ఈ విషయాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ట్విటర్ ద్వారా ప్రకటించారు. `కరోనాపై పోరాటానికి సహాయపడే క్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం సహాయనిధులకు రూ.పది లక్షల చొప్పున విరాళం అందించాలని మా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్ణయం తీసుకున్నార`ని ఆయన ట్వీట్ చేశారు. తన మార్క్ పంచ్‌లతో వెండితెరపై డైలాగ్‌లు సృష్టించే త్రివిక్రమ్ సాయం చేయడంలో ముందుండడంపై అభిమానులు ప్రశంసిస్తున్నారు. 

ఈ వైరస్ తీవ్రతను కట్టడి చేయడానికి ఇప్పటికే భారత ప్రభుత్వం 21 రోజులు దేశం మొత్తాన్ని లాక్‌డౌన్‌ ప్రకటించగా.. లాక్‌డౌన్ కారణంగా ఎంతో మంది బీద ప్రజలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి. ఇక ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలను ఆదుకునేందుకు తమ వంతు సాయం చేస్తున్నాయి.
 

See Also |  పేదలకు రూ.50 లక్షల విలువైన బియ్యం ఇచ్చిన సౌరవ్ గంగూలీ