ఇండస్ట్రీలో 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న త్రివిక్రమ్

రచయితగా త్రివిక్రమ్ కెరీర్ స్టార్ట్ చేసి, 2019 ఏప్రిల్ 22 నాటికి 20 సంవత్సరాలవుతుంది.

  • Published By: sekhar ,Published On : April 22, 2019 / 01:41 PM IST
ఇండస్ట్రీలో 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న త్రివిక్రమ్

Updated On : April 22, 2019 / 1:41 PM IST

రచయితగా త్రివిక్రమ్ కెరీర్ స్టార్ట్ చేసి, 2019 ఏప్రిల్ 22 నాటికి 20 సంవత్సరాలవుతుంది.

తన మార్క్ పంచ్‌లతో, ప్రాసలతో సినిమా మాటలకు గౌరవాన్ని తీసుకువచ్చాడు.. కథ, మాటల రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్. రచయితగా త్రివిక్రమ్ కెరీర్ స్టార్ట్ చేసి, 2019 ఏప్రిల్ 22 నాటికి 20 సంవత్సరాలవుతుంది. త్రివిక్రమ్ మొట్ట మొదటి సారిగా కథ, మాటలు అందించిన స్వయంవరం సినిమా 1999 ఏప్రిల్ 22 న విడుదలైంది. సముద్రం, నిన్నే ప్రేమిస్తా, నువ్వే కావాలి, వాసు వంటి సినిమాలకు డైలాగ్స్ రాసిన త్రివిక్రమ్.. చిరునవ్వుతో, నువ్వునాకు నచ్చావ్, మన్మథుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ వంటి సినిమాలకు కథ, మాటలు రాసాడు. తీన్‌మార్ సినిమాకి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, ఛల్ మోహన రంగ సినిమాకి కథ అందించాడు.

నువ్వే నువ్వే మూవీతో దర్శకుడిగా పరిచయమై, అతడు, జల్సా, ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వంటి సినిమాలతో ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. కొన్నిసార్లు డైరెక్టర్‌గా ఆయన సినిమాలు ఫెయిల్ అయినా, రైటర్‌గా ఆయనెప్పుడూ ఫెయిల్ అవలేదు. ఆయన పెన్ పవర్ అలాంటిది మరి.. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ఒక సినిమా చేస్తున్న త్రివిక్రమ్.. ఈ జెనరేషన్‌లో ఎందరో రచయితలకు స్ఫూర్తిగా నిలిచాడు.. ఆయన మరిన్ని మంచి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందించాలని ఆకాంక్షిస్తూ.. ఆల్ ది బెస్ట్ త్రివిక్రమ్.. 
 

వాచ్.. స్వయంవరం సీన్..