Tunnel : లావణ్య త్రిపాఠి చేసిన తమిళ సినిమా బాగుంది.. అందుకే తెలుగులో రిలీజ్ చేస్తున్నా..

తమిళంలో ఇటీవల రిలీజయి మంచి విజయం సాధించిన టన్నెల్ సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ కానుంది (Tunnel)

Tunnel : లావణ్య త్రిపాఠి చేసిన తమిళ సినిమా బాగుంది.. అందుకే తెలుగులో రిలీజ్ చేస్తున్నా..

Tunnel

Updated On : September 18, 2025 / 6:19 PM IST

Tunnel : అథర్వ మురళీ, లావణ్య త్రిపాఠి జంటగా రవీంద్ర మాధవ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘టన్నెల్’. తమిళంలో ఇటీవల రిలీజయి మంచి విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. ఈ సినిమాని తెలుగులో లచ్చురామ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ. రాజు నాయక్ రిలీజ్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత రాజు నాయక్ నేడు మీడియాతో మాట్లాడారు.(Tunnel)

రాజు నాయక్ టన్నెల్ సినిమా గురించి మాట్లాడుతూ.. టన్నెల్ సినిమాని చెన్నైలో చూశాను. కథ కొత్తగా ఉంది కదా అని ఇలాంటి సినిమాను తెలుగు వాళ్లకు అందించాలని తెలుగులోకి తీసుకు వస్తున్నాను. టన్నెల్ మూవీ కథ చాలా కొత్తగా ఉంటుంది. కథ అంతా కూడా ఒక్క రాత్రిలోనే జరుగుతుంది. పోలీసుల్ని హీరో ఎలా కాపాడతాడు? సైకోని ఎలా పట్టుకుంటాడు? టన్నెల్‌కి ఈ కథకు సంబంధం ఏంటి? అనే పాయింట్స్ ఆసక్తికరంగా, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఉంటాయి. సినిమా చుసిన వాళ్ళను నిరాశపరచదు అని తెలిపారు.

Also Read : Anudeep : అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్ ప్రసిడెంట్ అనుదీప్.. ఆహా.. జాతి రత్నాలు డైరెక్టర్ మామూలోడు కాదుగా..

టన్నెల్ టీజర్, ట్రైలర్‌కు తెలుగులో వచ్చిన రెస్పాన్స్ గురించి మాట్లాడుతూ.. టన్నెల్ టీజర్‌కి, ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. తమిళంలో ఈ మూవీని అందరూ మెచ్చుకుంటున్నారు. లావణ్య త్రిపాఠి కూడా ఈ సినిమాలో ఉండటం కలిసొచ్చింది. తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి స్పందన వస్తుంది అని అన్నారు.

తన నిర్మాణంలో తర్వాత రాబోతున్న సినిమాల గురించి మాట్లాడుతూ.. నా బ్యానర్‌లో ఇది వరకు దమ్మున్నోడు, స్వేచ్ఛ అనే సినిమాని నిర్మించాను. త్వరలోనే శ్రీ గాంధారి అనే సినిమాతో రాబోతోన్నాను. ఇంకా కొన్ని సినిమాలు ఓకే చేశాను. ఇప్పుడు మా ఫోకస్ అంతా టన్నెల్ మీదే ఉంది అని అన్నారు.

Also Read : OG Trailer: మోస్ట్ అవైటెడ్ ఓజీ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే?