గ్యాప్ లేకుండా షూటింగ్.. హీరోయిన్‌కు గుండెపోటు

  • Published By: vamsi ,Published On : November 24, 2019 / 06:35 AM IST
గ్యాప్ లేకుండా షూటింగ్.. హీరోయిన్‌కు గుండెపోటు

Updated On : November 24, 2019 / 6:35 AM IST

ఇండియన్ టీవీ హీరోయిన్, మోడల్, హీరోయిన్ గెహానా వసిష్త్ గుండెపోటుకు గురయ్యింది. సరైన పోషకాహారం తీసుకోకుండా ఎక్కువ టైమ్ షూటింగ్ చెయ్యడంతో ఆమెకు బీపీ తగ్గి గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఈమె పరిస్థితి విషయంగా ఉన్నట్టు తెలుస్తుంది.

గుండెపోటు వచ్చిన వెంటనే ఆమెను ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆమెను జాయిన్ చేశారు. ఓ వెబ్ సిరీస్ కోసం రెండు రోజుల పాటు విశ్రాంతి లేకుండా షూటింగ్ చేయడంతో ఆమెకు ఈ పరిస్థితి వచ్చినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు. 
 

TV actress Gehana Vasisth

ఆహరం తీసుకోకుండా కేవలం డ్రింక్స్ తీసుకుంటూ షూటింగ్ లో పాల్గొనగా బీపీ తగ్గిందని, ఇప్పటికి కూడా ఈమె పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.

అసలు ఆసుపత్రికి వచ్చే సమయానికే గుండె కొట్టుకోవడం ఆగిపోగా.. ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం ద్వారా ఆమె గుండెను కొట్టుకునేలా చేశారు డాక్టర్లు. అయితే పూర్తిగా ఆమెకు నయం మాత్రం కాలేదని డాక్టర్లు అంటున్నారు. ప్రస్తుతం ఆమె శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లుగా చెబుతున్నారు డాక్టర్లు.