Twinkle-Akshay with Rishi Sunak : రిషి సునక్‌ను కలిసిన ట్వింకిల్, అక్షయ్.. కారణం ఏంటంటే?
బాలీవుడ్ కపుల్ ట్వింకిల్ ఖన్నా- అక్షయ్ కుమార్ బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌ను కలిసారు. ట్వింకిల్ 'ప్రెట్టీ కూల్ మీటింగ్' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.

Twinkle-Akshay with Rishi Sunak
Twinkle-Akshay with Rishi Sunak : బాలీవుడ్ కపుల్ అక్షయ్ కుమార్-ట్వింకిల్ ఖన్నాలు బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్‌ని కలిసారు. వీరి కలయికను సూచిస్తూ ట్వింకిల్ ఖన్నా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ‘ప్రెట్టీ కూల్ మీటింగ్’ అంటూ పోస్ట్ పెట్టారు.
ఇటీవల లండన్ యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ట్వింకిల్ ఖన్నా అక్కడ తన భర్త అక్షయ్ కుమార్‌తో కలిసి ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఈ జంట బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్‌ను మీట్ అయ్యారు. వీరి మీట్‌కి సంబంధించిన వీడియోను ట్వింకిల్ ఖన్నా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసారు. ఈ వీడియోలో ఇటాలియన్ సింగర్ ఆండ్రియా బోసెల్లి ప్రదర్శన కూడా కనిపిస్తుంది. వీడియో చివర్లో ట్వింకిల్ రిషి సునక్, అక్షయ్ కుమార్‌లతో ఫోజులిచ్చింది. ‘చాలా కూల్ మీటింగ్.. సుధామూర్తి నా హీరో .. ఆమె అల్లుడు రిషి సునక్‌ని కలవడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ ట్వింకిల్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Zomato Funny Video : అక్షయ్ కుమార్ చెప్పిన హెల్దీ జ్యూస్ అట.. జొమాటో ప్రిపేర్ చేసింది.. రుచి సంగతి..
రిషి సునక్ ఇన్ఫోసిస్ దిగ్గజం ఎన్ఆర్ నారాయణ మూర్తి, సుధామూర్తి దంపతుల కుమార్తె అక్షతను వివాహం చేసుకున్నారు. ట్వింకిల్ ఖన్నా గతంలో తన డిజిటిల్ ప్లాట్ ఫామ్ కోసం సుధామూర్తిని ఇంటర్వ్యూ చేసారు.
View this post on Instagram