Toxic Pre Release Event : టాక్సిక్ ప్రీరిలీజ్ ఈవెంట్లో అపశృతి.. విద్యార్థులకు గాయాలు
Toxic Pre Release Event : పాన్ ఇండియా స్టార్ యశ్ హీరోగా నటించిన ‘టాక్సిక్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో అపశృతి చోటు చేసుకుంది.
Toxic Pre Release Event
Toxic Pre Release Event : పాన్ ఇండియా స్టార్ యశ్ హీరోగా నటించిన ‘టాక్సిక్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ శనివారం రాత్రి హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్శిటీలో జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. ఈ క్రమంలో ఓ ప్లడ్‌లైట్ స్తంభం మీదపడి ఇద్దరు యువకులు గాయపడిన ఘటన చోటు చేసుకుంది.
Also Read : Mahesh Kumar Goud: గతంలో కాపాడాం.. ఇకపై కుదరదు.. కొండా సురేఖకు ముగిసిన ఆప్షన్లు? TPCC చీఫ్ సంచలన హెచ్చరిక
ప్లడ్‌లైట్ స్తంభం మీద పడిన ఘటనలో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈవెంట్ కు వచ్చిన ప్రేక్షకులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు, నిర్వాహకులు రంగంలోకి వారికి సర్దిచెప్పడంతో గందరగోళ వాతావరణం సర్దుమణిగింది. ఎమ్మెల్యే మల్లారెడ్డి సైతం విద్యార్థులను సముదాయించాల్సి వచ్చింది. మరోవైపు.. గాయపడిన ఇద్దరు విద్యార్థులను పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారికి స్వల్పగాయాలు మాత్రమే కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం వారు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈవెంట్ కు భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరుకావడం వల్లనే ఈఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. ఇదిలాఉంటూ.. టాక్సిక్ సినిమాకు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నటులు నయనతార, కియారా, హుమా ఖురేషీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ పాన్ ఇండియా సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
