Shivashankar Master : శివశంకర్ మాస్టర్ గురించి మీకు తెలియని విషయాలు..

శివశంకర్ మాస్టర్ దాదాపు 800లకు పైగా సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. తమిళ, తెలుగు, కన్నడ చిత్రాలతో సహా 10 భాషల్లో పాటలకు నృత్యాలు సమకూర్చారు. శివశంకర్ మాస్టర్.................

Shivashankar Master :  గత కొన్ని రోజులుగా కరోనా వైరస్‌తో బాధపడుతున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన్ని కాపాడటానికి చిరంజీవి, ధనుష్, సోనూసూద్, మంచు విష్ణు ధన సాయం చేశారు, వైద్యులతో మాట్లాడారు. అయినా ఫలితం దక్కలేదు. 74 సంవత్సరాల వయసులో ఆయన కరోనాతో మరణించడం బాధాకరం. ఆయన జీవితంలోని ముఖ్య విషయాలు…..

Shivashankar Master : వెన్నెముక విరిగి ఎనిమిదేళ్లు మంచం పైనే.. తర్వాత 800 సినిమాలకి కొరియోగ్రఫీ

శివశంకర్ మాస్టర్ దాదాపు 800లకు పైగా సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు.
తమిళ, తెలుగు, కన్నడ చిత్రాలతో సహా 10 భాషల్లో పాటలకు నృత్యాలు సమకూర్చారు.
శివశంకర్ మాస్టర్ 1975లో ‘పాట్టు భరతమమ్‌’ చిత్రానికి సలీం మాస్టర్ దగ్గర సహాయకుడిగా కెరీర్‌ ప్రారంభించారు.
‘కురువికూడు’ చిత్రంతో నృత్య దర్శకుడిగా మారారు.
కేవలం కొరియోగ్రాఫర్‌గానే కాదు, నటుడిగా కూడా వెండితెరపైనా మెరిపించారు.
2003లో వచ్చిన‌ ‘ఆలయ్‌’ చిత్రంతో నటుడిగా మారిన శివశంకర్‌ మాస్టర్‌ దాదాపు 30కి పైగా చిత్రాల్లో నటించారు.
బుల్లితెరపైన కూడా ఎన్నో షోలకి జడ్జిగా వ్యవహరించారు.
కొన్ని షోలకి గెస్ట్ గా కూడా వచ్చి ప్రేక్షకులని అలరించారు.
ఆయన వద్ద శిష్యరికం చేసిన ఎంతో మంది కొరియోగ్రాఫర్‌లు ప్రస్తుతం టాప్‌ కొరియోగ్రాఫర్స్‌గా కొనసాగుతున్నారు.
శివశంకర్‌కు ఇద్దరు కుమారులు. విజయ్‌ శివశంకర్‌, అజయ్‌ శివశంకర్‌. ఇద్దరూ డ్యాన్స్‌ మాస్టర్లే.

Shivashankar Master : శివశంకర్ మాస్టర్ మరణంతో ఆందోళనలో టాలీవుడ్.. కరోనా ఇంకా పోలేదు

రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమాలో ఆయన కంపోజ్ చేసిన ధీర ధీర పాటకు నేషనల్ అవార్డు వచ్చింది. అనేక స్టేట్ అవార్డులు కూడా చాలా సాధించారు.

ట్రెండింగ్ వార్తలు