Unstoppable with NBK: అన్ స్టాపబుల్ బాలయ్య.. తెర వెనుక చిన్న కూతురు!

నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండతో థియేటర్లను, బాక్సాఫీస్ ను దద్దరిల్లేలా చేసి.. డిజిటల్ లో కూడా దుమ్మురేపిన సంగతి తెలిసిందే.

Unstoppable with NBK: అన్ స్టాపబుల్ బాలయ్య.. తెర వెనుక చిన్న కూతురు!

Unstoppable With Nbk

Updated On : January 31, 2022 / 9:16 AM IST

Unstoppable with NBK: నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండతో థియేటర్లను, బాక్సాఫీస్ ను దద్దరిల్లేలా చేసి.. డిజిటల్ లో కూడా దుమ్మురేపిన సంగతి తెలిసిందే. అచ్చ తెలుగు ఓటీటీగా పేరు తెచ్చుకున్న ఆహా.. బాలయ్యలోని మరో కోణాన్ని ప్రపంచానికి చూపించింది. బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్.. టైటిల్ కి యాప్ట్ అయ్యేలా ఎనర్జీకి మ్యాచ్ అయ్యేలా అన్ స్టాపబుల్ షోతో అదరగొట్టిన బాలయ్య తొలి సీజన్ తోనే ఇండియాలోనే బెస్ట్ షోగా మార్కులు కొట్టేశాడు.

Pushpa Hook Step: ఏంటీ.. క్రికెటర్లు డబ్బు తీసుకొని పుష్ప స్టెప్ వేశారా?

ఇక ఇప్పుడు త్వరలోనే రెండో సీజన్ మొదలు పెట్టేందుకు సన్నాహాలు జరుగుతుండగా ఈ సీజన్ ను కూడా మరో లెవెల్ లోనే సెట్ చేస్తుంది ఆహా టీం. కాగా.. ఈ షో ఇంతగా సక్సెస్ కావడానికి.. బాలయ్యలోని మరో కోణాన్ని.. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ను బయటకి రావడానికి.. వెనుక ఉన్న వారెవరు అన్నది చాలా రోజులుగా చర్చలు నడుస్తూనే ఉన్నాయి.

Salaar: సలార్ కూడా రెండు పార్టులా.. నీల్ ప్లాన్ ఏంటి?

ఈ షోకు ప్రముఖ రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి రైటర్ గా పనిచేస్తున్నాడు. తాజాగా పలు ఇంటర్వ్యూలలో మాట్లాడిన రవి మరో ఆసక్తికర విషయం చెప్పాడు. బాలయ్య అన్ స్టాపబుల్ షో కోసం బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని కూడా పనిచేశారని చెప్పాడు. బాలయ్యను కొత్తగా చూపేందుకు తేజస్విని చాలా రీసెర్చ్ చేశారని.. ‘అన్‌స్టాపబుల్’ టీమ్‌తో పనిచేస్తూ బాలయ్య లుక్, కాస్ట్యూమ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పడం ఆసక్తిగా కనిపించింది.