SVR విగ్రహావిష్కరణ వాయిదా

  • Published By: madhu ,Published On : August 24, 2019 / 05:13 AM IST
SVR విగ్రహావిష్కరణ వాయిదా

Updated On : May 28, 2020 / 3:43 PM IST

విశ్వ నట చక్రవర్తి SV రంగారావు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం వాయిదా పడింది. తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్, కె.ఎన్.రోడ్డులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆగస్టు 25వ తేదీ ఆదివారం ముహూర్తం నిర్ణయించారు. దీనికి ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారు. విగ్రహ ఆవిష్కరణ చేయాల్సిందిగా ఎస్వీఆర్ సమితి సభ్యులు చిరును కలిసి కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దీనిని వాయిదా వేసినట్లు సభ్యులు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదని తెలుస్తోంది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామంటున్నారు. 

తాడేపల్లిగూడెం ఎస్‌వీఆర్ సేవా సమితి కొన్ని నెలల కిందట ఎస్వీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. చిరంజీవితో విగ్రహాన్ని ఆవిష్కరింప చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ కార్యక్రమం కూడా వాయిదా పడింది. 

మరోవైపు ఇదిలా ఉంటే..చిరంజీవి నటించిన సైరా సినిమా అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలై సంచలనం సృష్టిస్తోంది. చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రత్యేక పాత్ర పోషించారు. నయనతార, తమన్నతో పాటు ఇతరులు నటించారు.
Read More : 
SVR కోసం : తాడేపల్లిగూడెంకు మెగాస్టార్ చిరంజీవి